దాతృత్వ సేవ 02

(ఆదాయ పన్ను శాఖ వారి 80G సదుపాయంతో):

శ్రీశైల మల్లికార్జున సమాజోథ్థాన ఫౌండేషన్ ట్రస్ట్ (రి)

బసవేశ్వర కాలనీ, మమతా నగర్, నాగోల్, హైదరాబాద్

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయము మరియు

శ్రీశ్రీశ్రీ జగద్గురు పంచాచార్య వీరశైవ ధార్మిక భవన నిర్మాణము

సద్భక్త మహాశయులకు!

శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారల మరియు శ్రీ ఆది జగద్గురు పండితారాధ్యుల దివ్య ఆశీస్సులు తెలియజేయుచు.

ఈ సకల చరాచర సృష్టిలో మానవ జన్మకు మించిన అద్భుతమైన జన్మ మరొకటిలేదు. అందుకే మానవ జన్మ సార్థకము చేసుకోవాలి. సంస్కారము, వివేకం, వివేచన వంటి లక్షణాలు కలిగి ఉండటముతో పాటు జీవితాన్ని మరింత చక్క దిద్దుకునేందుకు తపనపడాలి. ఔన్నత్వంతో జీవించాలనుకోవడమే మానవజన్మకు సార్థకత ప్రసాదిస్తుంది.

గత రెండు దశాబ్థములందు తెలుగు రాష్ట్రములందు గల వీరశైవ సమాజములవారు అనేక అభివృధ్ధి కార్యక్రమాలు నిర్వహించుటలో సఫలీకృతులైనారు. అనేక ప్రాంతములందు కులసంఘ భవనములు నిర్మించుకొనుట మరియు జగద్గురువులచే ధార్మిక కార్యక్రమాలను నిర్వహించుట, వీరశైవ సాహిత్య గ్రంథములముద్రణ మొదలగు కార్యక్రమాలు చేయడమైనది. వీటన్నింటికిని ప్రధాన కారణం శ్రీమద్ కాశీ జగద్గురువుల ధర్మ ప్రచార పర్యటన అని చెప్పకతప్పదు. అనేక ప్రాంతములందు వీరశైవ ధర్మోద్ధారకులు, భక్తి భండారి శ్రీ మహాత్మా బసవేశ్వరుల విగ్రహాలు ప్రతిష్టించడమైనది.

ప్రధానముగా రాష్ట్ర రాజధానియందు సరైన వేదికలేనందున (సమావేశ మందిరము) రాష్ట్రస్థాయి సమాజములవారు సమావేశాలు నిర్వహించుటకు మరియు జగద్గురువులచే, స్వాములచే ప్రవచన కార్యక్రమాలు నిర్వహణకు అన్ని సమాజములవారికి ఇబ్బందికర పరిస్థితులు గలవు. అదేవిధంగా ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు సరైన ప్రాసాద నిలయాలు లేవు.

వీరశైవ ధర్మాభివృద్ధికి, సమాజాభివృద్ధికి తెలుగు రాష్ట్రములందు ప్రథమంగా విశేష కృషి చేసిన వీరశైవ సమాజ సేవాతత్పరులు 'వీరశైవ లింగాయత్ ప్రగతి సమాజం, నాగోల్ ' కార్యవర్గసభ్యులు, అనేక ప్రాంతములందు పర్యటించి వీరశైవ ధర్మజాగృతికై విశేష కృషి చేసినారు. హైద్రాబాద్ నగరమునందు ప్రముఖులను అహ్వానించి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడమైనది. అట్టివారిలో లి||శెట్టి చంద్రశేఖర్ (సబ్ రిజిస్టర్); ఎం.జగదీశ్వర్, ఉప్పల్; వాలి బస్వరాజ్, నాగోల్; ఆకుల నాగభూషణం, ఖైరతాబాద్; గంధే సోమశెఖర్, చందానగర్; శివశరణి పి. శశికళ, వనస్థలిపురం; ఎం.రాచప్ప, నాగోల్; జి.మల్లప్ప, నాగోల్; కె.నాగరాజు, ఖైరతాబాదు గార్లు. వీరి కృషి ఫలితముగా మమతానగర్ నాగోల్ నందు సమాజాభివృద్ధికై స్థలమునుకొని అందులో అమరికి ఉపయోగకరమైన భాన నిర్మాణము, ఆలయ నిర్మాణము చేయుట వీరి ప్రధాన సంకల్పము. ఇట్టి స్థలమును అభివృద్ధి పరచి ఈరశైవ సమాజానికి చిరకాలము సేవలందించాలని సదుద్ధేశ్యముతో మాయోక్క శ్రీశాఇలమల్లికార్జున సమాజోథ్థాన ఫౌండేషన్ ట్రస్ట్ నకు రిజిస్టర్ చేయడం అయినది. దీనియోక్క సేవలు ఒక ప్రాంతానికి గాని ఒక వర్గానికి సంబంధము లేకుండా అన్ని ప్రాంతముల భక్త మహేశ్వరులకు ఉపయోగపడు విధంగా చేయుట జరుగును.

బెంగళూరు మహానగరమందు వీరశైవులకు చెందినటువంటి ఉచిత వసతి ప్రసాద నిలయాలు విద్యార్థులకై 22 వసతి గృహాలు కలవు. ఇందులో పదివేల మంది విద్యార్థులు సంవత్సరమునకు నామమాత్ర రుసుముతో ఈ వసతి గృహములందు ఉంటూ చదువుకొనుచున్నారు. ఇదేవిధంగా హైదరాబాద్ మహానగరమందు చేయవలెననునది మాయొక్క సంకల్పము. ఈ స్థలమందు (1) విద్యార్థులకు వసతి (2) గ్రంధాలయము (3) సమావేస మందిరము (4) స్వాములకు మరియు ఇతర ప్రాంతాలనుండి వచ్చే భక్తాదులకు వసతి (5) ప్రసాద నిలయము (6) శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణము.

ఈ బృహత్తర నిర్మాణ కార్యక్రమాన్ని మే-2021 సం||యందు భూమిపూజతో ప్రారంభించబడెను. ఈ కార్యక్రమాలకు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అగును. ఇందులో రెండు కోట్ల రూపాయలు కర్ణాటక ప్రభుత్వము వారు ఇచ్చుటకు అంగీకరించినారు.

సమయాన్ని, సంపదను, జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకోసం ఉపయోగించేవారిని ధన్యులు అని సంభోదిస్తారు. అతి ముఖ్యమైన జీవిత విలువలు గుర్తించి, సమాజహితాన్ని, వీరశైవ ధర్మంలోని దాసోహ భావాన్ని దృష్టియందుంచుకొని సమాజాభివృద్ధికి సహకారమందించి ధన్యులుగా కీర్తిప్రతిష్టలను ఆర్జించండి.

వీరశైవ సమాజాభివృద్ధిని ఆకాంక్షించే వారందరు తమ కుటుంబ పెద్దల జ్ఞాపకార్థము లేద తమ వ్యక్తిగత పేరుపై ఆలయ/భవన నిర్మాణమునకు తమ శక్త్యానుసారము సహాయ సహకారములు అందించగలరని ఆశిస్తున్నాము.

1. పరమదాసోహి రూ||25,00,000/-

2. మహాదాసోహి రూ||10,00,000/-

3. దాసోహి రూ|| 8,00,000/-

4. దానశిరోమణి రూ|| 2,51,000/-

5. మహాదాత రూ|| 1,00,116/-

6. దాత రూ|| 51,000/-

7. మహాపోషకులు రూ|| 25,000/-

8. పోషకులు రూ|| 11,000/-

క్రమసంఖ్య 1 నుండి 6 దాతల పేరు శిలాఫలకముపై మరియు వారి యొక్క ఫొటో ప్రధాన హాలునందు ఉంచబడును. క్రమసంఖ్య 7 & 8 దాతల పేరు పేయొంట్తో బోర్డ్ పై వ్రాయబడును.

ఈ బృహత్తర నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేయుటకై ఏర్పాటు చేసిన కమిటీలు:

(1) భవన నిర్మాణ కమిటీ సభ్యులు:

మాడపు వీరమల్లేష్, వాలి బస్వరాజ్, డా||మల్లికార్జున్, నేతి వీరేశం, జి.మల్లప్ప, ఎం. కరుణాకర్ గార్లు

(2) ఆర్థిక కమిటీ సభ్యులు:

జగదేవ్ హిరేమఠ్ (9246581653); నేతి మహేశ్వర్ (94404548769); శ్రీమతి పి. రుద్రమదేవి (9246838408); వి.నాగభూషణం (9949473555); పి.బసవేశ్వర్ (9440489622); ఆలూరి ఈశ్వర ప్రసాద్ (9000755189)

విరాళములు ఇచ్చు దాతలకు ఆదాయపు పన్ను శాఖ వారి 80జి సౌకర్యము కలదు. తమ విరాళములను ఈ క్రింద తెలియపరచిన అకౌంట్ నందు ఆర్.టి.జి.ఎస్. లేదా చెక్ రూపంలో చెల్లించి తగిన రశీదు పొందగలరు.

SHRI SHRISHAILA MALLIKARJUNA SAMAJOTTHANA FOUNDATION TRUST

A/C NO.37340499632,

STATE BANK OF INDIA

BRACNH: NAGOLE, HYDERABAD

IFSC CODE: SBIN0021056

ఇంకా పూర్తి వివరాలకై ఆర్థిక కమిటీ సభ్యులను సంప్రదించవచ్చును.

శివం భూయాత్

శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురు డా||చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వాములు, శ్రీశైలం