కాశీ నగరము భిన్న సంస్కృతులతో కూడినది. 300 మఠములు 1550 దేవస్థానములిచట గలవు. శాసనముల బట్టి కాశీ జంగమ వాడిమఠము క్రీ.శ.6వ శతాబ్దముకంటె పూర్వమున ఉన్నట్టిది.
కాశ్యాం విశ్వేశ లింగాశ్చ విశ్వారాధ్యస్య సంభవ:
స్థానం శ్రీ కాశీక్షేత్రే శ్రుణ పార్వతి సాదరమీ|| (స్వాయంభవాగమము)
స్కంద గోత్రాది నాధశ్చ మహాసింహాసనాగ్రణీ:
విశ్వారాధ్య ఇతిఖ్యాతో జగద్గురూత్తమశ్చస:|| (సుప్రభేదాగమము)
క్రీస్తు పూర్వము 2040న శ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు పట్టాధికారులై యుండిరి. నాటి నుండి నేటివరకు క్రమముగా వరుస దప్పక 86 మంది జగద్గురువులు పీఠమునలంకరించిరి. వీరు స్కంద గొత్రీకులు. పంచవర్ణ సూత్రీయులు. కంబాల పంచముఖ గగన, గోచార, శిథిలి మొదలగు ఉపసూత్రములను ఈ పీఠమునకు చెందినవారుగలరు. 'య ' కార ప్రణవ స్వరూపులు. సీసపు కమండలధారులు. బిల్వదండ ధారులు. పసుపుపచ్చ ద్వజమును చేబూనిన వారు. ఈ పీఠారోహణము చేసిన వారిలో 77 మంది జగద్గురువులు మల్లికార్జున శివాచార్యులు గానే క్రీ.శ. 1750 వరకు పేర్కొనబడినారు. ఆ తదుపరి జగద్గురు మల్లికార్జున శివాచార్య పేరుతో పాటువారు ష.బ్ర.శివాచార్యులుగా నుండి అప్పటి పేరు తోడనో లేదా పూర్వపు నామముతోనో పిలువబడినారు.
ఈ పీఠమునకు క్రీ.పూ.నుండి నేటి వరకు క్రమము తప్పకుండా 86 మంది జగద్గురువులు పీఠారోహణ మొనరించినారు. క్రీ.పూ.2040న పీఠాధికారులైన గాదె స్వామివారి గద్దుగెయే జంగమ వాడి మఠమున పూజలందు కొనుచున్నది.
కాశీ ప్రభువుల జయనంద దేవరాజు క్రీ.శ. 574 విక్రమ నామ సంవత్సర కార్తీక శుద్ద ఏకాదశినాడు భూదానము చేసినారు. అది హిందీభాషలో నున్నది. ఆశాసనమునే వారి వంశీయుడైన ప్రభునారాయణ సింహకాశీరాజు, తిరిగి తామ్ర పటమున వ్రాయించి హస్తాక్షరము చేసి ఇచ్చియుండిరి. ఈ స్థానము నందే హిందూ విశ్వవిద్యాలయము స్థాపితమయినది. దీని వెనుక 'జంగమపుర ' యను పల్లె గలదు. 1879 న వీరభద్ర శివాచార్యమహాస్వాములు, శ్రీ రాజేశ్వర శివాచార్య మహాస్వాములు, శ్రీశివలింగ శివాచార్య మహాస్వాములు జగద్గురువులుగా పీఠమునెక్కిరి.
83వ జగద్గురువుగా పంచాక్షర శివాచార్య మహాస్వాములు పీఠము నెక్కిరి. అప్పటికి పీఠము అస్తవ్యస్తముగా నుండి విశ్వారాధ్య బ్యాంక్ దివాళా తీయుటచే డిపాజటర్లు తమ పొదుపు మొత్తమును వాపసు చేయమని ఒత్తిడి చేయసాగిరి. మఠమునకు గల ఆస్తులు దానమివ్వబడినవి. అవి అమ్ముటకు వీలులేదు అని శాసనములన్నిటిని కోర్టునకు దాఖలు పరచిరి. కోర్టుదానమిచ్చిన వాటిని అమ్ముటకు వీలులేదనియు పీఠము జగద్గురువులచే అప్పులు నిదానముగా తీర్చవలెనని తీర్పునిచ్చిరి.
ఈ పీఠమునకు జగద్గురువులైన వారందరు మహావిద్వాంసులు, తపస్సంపన్నులు, శివయోగ సిద్దులు మరియు నిష్టాగరిష్టులు.
84వ జగద్గురువులయిన చిదిరెమఠం వీరభద్ర శివాచార్య భగవత్పాదులు రేణుకాచార్యుల అవతారస్థానమైన కొలనుపాక క్షేత్ర సమీపమునందలి చర్లపల్లి వాస్తవ్యులు నాగభూషణ శాస్త్రి, శ్యామలాంబ తల్లిదండ్రులు. పసితనముననే తల్లిదండ్రులు మరణించగా జన్మస్థలము వదలి నారాయణపేట సంస్కృత కళాశాలలో చేరి సంస్కృతముతో పాటు కన్నడమును నేర్చిరి. పంచకావ్యములను నాటకములను, లఘు కౌముది వ్యాకరణమును, పంచాంగ గణితమును, పౌరోహిత్యము మున్నగుననెల్ల కరతలామలకము చేసికొనిరి.
ఇటిగె సభలో ప్రసంగించిన సభకులను ముగ్థులను గావించి శ్రీ బాపూరావు దేశ్‌ముఖ్ గారి ప్రశంసనొది విద్యాకేంద్రమగు కాశీపట్టణమున చదువుకొనుటకు ప్రోత్సహింపబడిరి. 1930లో వేద తీర్థ, ఆ పిదప కావ్యతీర్థ, స్కృతితీర్థ, దర్శన తీర్థమున్నగు అనేక తీర్థాలలో నుత్తీర్ణులైరి. జగద్గురువులచే విద్యానిధియను ప్రశస్తిని పొందిరి. అనేక గ్రంథములు పలుభాషలలో వ్రాసిరి. సమాజమందలి దూషిత పద్దతులను దూరమొనప్రింప తలచి అనేక చిన్న చిన్న కథలను వ్రాసి ప్రకటించిరి.
పురాతత్వ శాఖలో పేరుగడించిరి. ఉత్తరకాశీ స్తంభముపై చెక్కబడిన ప్రాచీనలిపిని చదివి దాని అభిప్రాయమును వ్యాసరూపమున వెలువరించిరి. 40 రీతుల ప్రాచీన లిపులను తెలసినవారు వీరు. 1934లో కాశీ వీరశైవ విద్వత్‌సంఘ్ సంస్థను స్థాపించిరి. 10 సం||లు కాశీలో నుండి అపారమగు విద్యనార్జించిరి.
సికింద్రాబాద్ నగరమున మటికె నాగయ్య గారి ప్రోత్సాహమున శైవభారతి గ్రంథాలయము, వీరశైవ గురుకులము స్థాపించి విభూతి పత్రిక నడిపిరి. 27-09-1944 న కాశీజ్ఞాన సింహాసనాధీశులైరి. సికింద్రాబాద్ లోని గ్రంథములన్నింటిని కాశీకి తరలింపచేసిరి. వారు సేకరించిన పుస్తకములు ఎవరును సేకరింపలేదు. ప్రాచ్యలిఖిత భాండాగారము. వారెన్నో పుస్తకములను ఫోటో సాయమున ప్రతులు తీసికొన్నారు. 25-1-1948వ తేదిన లింగైక్యమొందిరి. ఎవరును చేయజాలని అనేక కార్యములు చక్కబెట్టిరి. వీరి మరణానంతరము జగద్గురు విశ్వేశ్వర శివాచార్య మహాస్వాములు పట్టాభిషిక్తులైరి. మహారాష్ట్రములో అధిక సంచారమొనరించి అనేక కట్టడములు రూపొందించిరి. వీరి పిదప డా||చంద్రశేఖర శివాచార్య మహాస్వాములు జగద్గురువులైరి.
డా||చంద్రశేఖర శివాచార్య మహాస్వాములు అమరేశ్వరమఠమునకు ష.బ్ర. శివాచార్యులుగా నుండి సిద్దాంతశిఖామణి పై ప్రవచనములు చేయుచుండిరి. ఆ సమయముననే వీరశైవ పంచపీఠ పరంపర రెండుమార్లు కన్నడ భాషలోను ముద్రితమై కన్నడ రాష్ట్రపతి ఇల్లు చేరినది. సిద్దాంతశిఖామణి ప్రవచన గ్రంథం మరాఠీ భాషలోనికి అనువదితమైనది, తెలుగునను అనువాదింపబడినది.
కాశీ పీఠమునందు చేరి మూడు సంవత్సరములు వేదాంతాచార్య పాఠ్యాంశముల నభ్యసించి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైరి. సర్వదర్శన తీర్థ, వేదాంతాచార్య పరీక్షలు రాసి ప్రథములుగా నిలిచిరి. సిద్దాంతశిఖామణి షడ్ధర్శనములు తులనాత్మక అధ్యయన పరిశోధన గావించి సంస్కృతమున పరిశోధనా గ్రంథమును సమర్పించి విద్యావారధి డిగ్రీ పొందిరి. శక్తి విశిష్టాద్వైత తత్త్వత్రయ విమర్శ అను విషయముపై పరిశోధనా ప్రసంగము చేయసాగిరి. 1989 సం||న పట్టాభిషిక్తులైరి. 'విద్యావాచస్పతి ' బిరుదు పొందిన ఏకైక వీరశైవ జగద్గురులు వీరు. జంగమ వాడి మఠమును శోభాయమానముగా తీర్చిదిద్దిరి. పంచాక్షర సదనము, విశ్వేశ్వర సదనము మున్నగు కట్టడముల నెన్నిటినో నిర్మింపజేసిరి. బహుళ గ్రంథములు రచించి ప్రచురణ మొనరించిరి. చిదిరె మఠం వీరభద్ర శివాచార్యుల శతజయంత్యుత్సవముల ఆయాభాగములందు నిర్వహింపజేసిరి. శ్రీ.కె.ప్రతాప్ గారిచే శ్రీవీరభద్ర శివాచార్య గ్రంథములన్నింటిని గుడి గూర్చి ఒక గ్రంథముగా 13-8-2008 న వెలువడచేసిరి.
ఆంధ్రప్రదేశ్‌న అనేక ప్రాంతములు సంచరించి ధర్మప్రదేశముల శుభాశీర్వాద సందేశముల మూలకముగా ధర్మ ప్రచారము గావించిరి. పీఠమునందో లేక స్వరాష్ట్రములోనో యుండక ప్రజల దగ్గరకే వచ్చి వారితో సంపర్కము పెంపొందింప నెంచి శివపూజానుష్టానములు సాగించిరి.షాద్‌నగర్ నందు శ్రీ సజ్జల కాశీనాథ గారి ఆమంత్రణము మేరకు వారి జామతోటయందు జంగమవాడి ఉపశాఖామఠం నిర్మింపతలచిరి. గురుకులం, కమ్యునిటీ హాలు, విద్యార్థివసతి గృహములు, విశ్వేశ్వర విశ్వనాథ మందిరములు భక్తవరేణ్యుల దాతృత్వ ధన సహాయముచే అతి త్వరిత గతిని నిర్మింపచేసిరి. పంచపీఠాధీశులో భక్తులకు అత్యంత సన్నిహితులుగా మెలిగెడి జగద్గురువులు వీరు. వీరి చరణారవిందములకు ఇతీ నా నమోవాకములు.
శ్రీశ్రీశ్రీ జగద్గురు పంచాక్షర శివాచార్య భగవత్పాద (కృతయుగం)
శ్రీశ్రీశ్రీ జగద్గురు పంచవక్త్ర శివాచార్య భగవత్పాద (త్రేతాయుగం)
శ్రీశ్రీశ్రీ జగద్గురు విశ్వకర్ణ శివాచార్య భగవత్పాద (ద్వాపరయుగం)
శ్రీశ్రీశ్రీ జగద్గురు విశ్వారాధ్య శివాచార్య భగవత్పాద (కలియుగం)
1. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.2001 - 1690)(311 సం||లు)
2. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.1690 - 1576)(114 సం||లు)
3. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.1576 - 1501)(75 సం||లు)
4. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.1501 - 1400)(101 సం||లు)
5. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.1400 - 1275)(125 సం||లు)
6. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.1275 - 1195)(80 సం||లు)
7. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.1195 - 1131)(64 సం||లు)
8. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.1131 - 1076)(55 సం||లు)
9. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.1076 - 1019)(57 సం||లు)
10. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.1019 - 956(63 సం||లు)
11. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.956 - 881)(75 సం||లు)
12. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.881 - 847)(34 సం||లు)
13. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.847 - 802)(45 సం||లు)
14. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.802-765)(37 సం||లు)
15. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.765-699)(66 సం||లు)
16. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.699-668)(31 సం||లు)
17. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.668-643)(25 సం||లు)
18. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.643-626)(17 సం||లు)
19. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.626-611)(15 సం||లు)
20. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.611-590)(21 సం||లు)
21. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.590-513)(77 సం||లు)
22. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.513-478)(35 సం||లు)
23. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.478-438)(40 సం||లు)
24. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.438-393)(45 సం||లు)
25. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.393-342)(51 సం||లు)
26. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.342-314)(28 సం||లు)
27. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.314-300)(14 సం||లు)
28. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.300-233)(67 సం||లు)
29. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.233-214)(19 సం||లు)
30. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.214-190)(24 సం||లు)
31. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.190-168)(22 సం||లు)
32. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.168-116)(52 సం||లు)
33. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.116-78)(38 సం||లు)
34. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.78- 36)(42 సం||లు)
35. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.36-7) (29 సం||లు)
36. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.7-5)(02 సం||లు)
37. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.పూ.51 - క్రీ. శ.59)(54 సం||లు)
38. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.59-81)(22 సం||లు)
39. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.81-105)(24 సం||లు)
40. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.105-131)(26 సం||లు)
41. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.131-155)(24 సం||లు)
42. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.155-214)(59 సం||లు)
43. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.214-228)(14 సం||లు)
44. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.228-285)(57 సం||లు)
45. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.285-354)(69 సం||లు)
46. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.354-417)(63 సం||లు)
47. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.417-438)(21 సం||లు)
48. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.438-449)(11 సం||లు)
49. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.449-521)(72 సం||లు)
50. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.521-553)(32 సం||లు)
51. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.553-674) (121 సం||లు)
52. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.674-759)(85 సం||లు)
53. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.759-793)(34 సం||లు)
54. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.793-829)(36 సం||లు)
55. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.829-882)(53 సం||లు)
56. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.882-940)(58 సం||లు)
57. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.940-996)(56 సం||లు)
58. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.996-1009)(13 సం||లు)
59. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1009-1057)(48 సం||లు)
60. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1057-1103) (46 సం||లు)
61. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1103-1122)(65 సం||లు)
62. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1122-1187)(65 సం||లు)
63. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1187-1201)(14 సం||లు)
64. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1201-1275)(74 సం||లు)
65. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1275-1347)(72 సం||లు)
66. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1347-1356)(09 సం||లు)
67. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1356-1429)(73 సం||లు)
68. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1429-1442)(13 సం||లు)
69. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1442-1460)(18 సం||లు)
70. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1460-1527)(67 సం||లు)
71. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1527-1547)(20 సం||లు)
72. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1547-1583)(36 సం||లు)
73. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1583-1631)(48 సం||లు)
74. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1631-1639)(8 సం||లు)
75. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1639-1663)(24 సం||లు)
76. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1663-1710) (47 సం||లు)
77. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1710-1750)(40 సం||లు)
78. శ్రీశ్రీశ్రీ జగద్గురు శివలింగ శివాచార్య మహాస్వాములు (ప్రథమ) (క్రీ.శ.1750-1825)(75 సం||లు) 79. శ్రీశ్రీశ్రీ జగద్గురు హరీశ్వర శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1825-1879)(54 సం||లు)
80. శ్రీశ్రీశ్రీ జగద్గురు వీరభద్ర శివాచార్య మహాస్వాములు (ప్రథమ) (క్రీ.శ.1879-1891)(12 సం||లు)
81. శ్రీశ్రీశ్రీ జగద్గురు రాజేస్వర శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1891-1907)(16 సం||లు)
82. శ్రీశ్రీశ్రీ జగద్గురు శివలైంగ శివాచార్య మహాస్వాములు (ద్వితీయ)(క్రీ.శ.1907-1932)(25 సం||లు)
83. శ్రీశ్రీశ్రీ జగద్గురు పంచాక్షర శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1932-1944)(12 సం||లు)
84. శ్రీశ్రీశ్రీ జగద్గురు వీరభద్ర శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1944-1948)(3 సం||ల 3 నెలల 21 దినముల 6 గంటల 10 నిమిషాలు)
85. శ్రీశ్రీశ్రీ జగద్గురు విశ్వేస్వర శివాచార్య మహాస్వాములు (క్రీ.శ.1948-1989) (14-11-1948 నుండి 02-10-1989 వరకు)
86. శ్రీశ్రీశ్రీ జగద్గురు డా||చంద్రశేఖర శివాచార్య మహాస్వాములు (17-11-1989 నుండి)
87. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లికార్జున శివాచార్య మహాస్వాములు (ఉత్తారాధికారి)
కాశీ పీఠ గురుపరంపర:
శ్రీశ్రీశ్రీ జగద్గురు విశ్వారాధ్య శివాచార్య భగవత్పాద
శ్రీశ్రీశ్రీ జగద్గురు డా||చంద్రశేఖర శివాచార్య మహాస్వాములు
CONTACT US
admin@veerashaivadharmam.com