ఈ పీఠమునకు మూలస్థానము మధ్యప్రదేశ్ నందలి (నాటి మాళవదేశము) క్షిప్రానదీ తీరమందలి వటక్షేత్ర సిద్దేశ్వరము. ద్వాపర యుగపు ఆచార్యులయిన శ్రీజగద్గురు దారుకాచార్యులు నైమిశారణ్యమందు దధీచిని శిష్యునిగా స్వీకరించి శివాద్వైత సిద్దాంతమును బోధించి యాతనిచే లోక ప్రచారముగావించిరి. ఈ పీఠము సద్ధర్మ సింహాసనమునకు చెందినది. గోత్రపురుషుడు నంది అందుచే ఈ పీఠమునకు చెందినవారు నంది గోత్రికులు వృష్ఠిసూత్రీయులు. ఈ మహాసూత్రమేగాకలోహకంద, స్వర్ణకంథ, శృంగి మొదలగు పండ్రెండు ఉపసూత్రములను గలవు. 'మ ' కార ప్రణావాక్షర సంపన్నులు. రజత కమండలధారులు పలాశదండ ధారులు. ఎఱుపు పతాకమును చేబూని లోకసంచారము గావించుచూ ధర్మప్రచారము చేయుచున్నారు.
బళ్ళారి సమీపమునందలి ఉజ్జయిని పీఠమునకు నేటివరకు 111 మంది జగద్గురువులు పీఠారోహణ మొనరించి ధర్మప్రచారము గావించినట్లు జగద్గురు శ్రీసిద్దలింగేశ్వర విజయ (1944) మను పుస్తకము నుండి గ్రహింపబడినది.
"తద్వన్మరుళసిద్దస్య వటక్షేత్రమహత్తరే
సిద్దేశలింగా జ్జననం స్థానమజ్జయినీ పురేరి" అను స్వయంభు వాగమ వచనాను సారమున మరుళ సిద్దేశ్వరులు ఉజ్జయిని చేరినట్లు తెలియచున్నది.
ఈ పీఠపరంపర యందు సిద్దమునులు శివమునీంద్రస్వాములు, శాంతమునులు, భవభూతిమునులు, ఇమ్మడి ముక్తిమునులు, ఇమ్మడిసిద్దమునులు, సాంబమునులు, ఇమ్మడి శివమునులు, శంభుమున్నగు వారెందరో జగద్గురువులయిరి.
జగద్గురు సిద్దమల్లేశ్వరులు తమ తపోబలముచే వర్షము కురిపించి మళ్ళెమల్లేశ్వర స్వాములుగా పేరొందిరి. వీరు దళితోద్దరణముగావించిరి. వీరిపిదప గురుసిద్ద వటులకు జగద్గురుత్వము సిద్దించెను. 108 వ పీఠాధిపతిగా సిద్దలింగవరేణ్యులయిరి. వీరు బుకాంబుధి యందు తపమొనరించి వీరి తపోబలముచే రంభాపురి పీఠమునకు అస్తిత్వము కలిగించిరి. నీలకంఠలింగను కేదారపీఠమునకు జగద్గురువు పట్టము గట్టించిరి. శ్రీ పీఠమున గోరక్షణ శాలను, శివపూజామందిరమును, పంచాచార్యుల సభామంటమును, దాసోహమునకై పాకశాలను నిర్మింపజేసిరి. జ్ఞానగురు విద్యాపీఠమను సంస్థను స్థాపించిరి. 1916లో వీరశైవులు విద్యాభివృద్ధికై మద్రాసు వీరశైవ విద్యావర్థక సంఘము స్థాపనకు కారకులైరి. 1918లో అది రిజిష్టరు గావింపబడి నేడు ఎన్నో విద్యాసంస్థలతో అలరారుచున్నది.
వీరి పిదప త్రిలోచనాచార్యులు ఉత్తరాధికారులైరి. పీఠోద్దరణ మొనరించిరి. జ్ఞాన గురువిద్యా పీఠమును రిజిష్టరు చేయించిరి. ఈ సంస్థకు అయ్యే ధనమును, భూమిని సేకరించిరి. అనేక ప్రాంతములందు ఉన్నత పాఠశాలలు, కాలేజేలు స్థాపించిరి. ధర్మప్రచారమునకై సద్దర్మప్రభ త్రైమాసిక పత్రికను నెలకొల్పిరి.
110వ జగదురువుగా మరుళారాధ్య శివాచార్యులు పీఠారోహణము చేసిరి. విద్యాక్షేత్ర విస్తరణకు కృషిసలిపిరి. పల్లెపట్టణాలలో విద్యాసంస్థలు స్థాపించిరి. ఇంగ్లీషునందు రచించిన శ్రీరేణుకాగీతయను గ్రంథమును సిద్ధాంత శిఖామణిగా ప్రకటించిరి.
111వ జగద్గురువుగా మరుళసిద్ద రాజదేశికేంద్ర శివాచార్య 5-11-1995వ తేదీన ఉజ్జయినీ పీఠమునందు రంభాపురి, కేదారము, శ్రీశైలము, కాశీ జగద్గురువుల సమక్షమున పీఠారోహణము సంరంభముతో జరిగెను.
వీరు పీఠారోహణము చేసిన జగద్గురువులలో అతిపిన్న వయస్సువారు, ఆంధ్రులు. వీరు రాత్రింబవళ్ళు శ్రమించి పీఠోద్దరణము గావించినారు. పూర్వపు కట్టడములన్నింటిని మార్పు చేసినారు. విద్యాసంస్థలను స్థాపించినారు. కర్ణాటకముననే గాక ఆంధ్రప్రదేశమంతటను సంచరించుచూ ధర్మప్రచారము గావించుచున్నారు. యాత్రికులకై వసతి గృహ నిర్మాణములు చేపట్టినారు. 2007వ సంవత్సరము ద్వాదశి వార్షికోత్సవము అత్యంత వైభవముగా ఉజ్జయిని యందే సుమారు ఎనుబది లక్షలమంది భక్తులరాకతో నిర్వహించినారు.
శ్రీశ్రీశ్రీ జగద్గురు ద్వ్యాక్షర శివాచార్య భగవత్పాద (కృతయుగ ప్రారంభం)
శ్రీశ్రీశ్రీ జగద్గురు ద్వివక్త్ర శివాచార్య భగవత్పాద (త్రేతా యుగం ప్రారంభం)
శ్రీశ్రీశ్రీ జగద్గురు దారుకాచార్య భగవత్పాద (ద్వాపర యుగం ప్రారంభం)
1. శ్రీశ్రీశ్రీ జగద్గురు మరులారాధ్య శివాచార్య భగవత్పాద (కలియుగం ప్రారంభం)
2. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లిఖార్జునశివాచార్యులు
3. శ్రీశ్రీశ్రీ జగద్గురు సిద్ధేశ్వర శివాచార్య
4. శ్రీశ్రీశ్రీ జగద్గురు గురునాథ్ శివాచార్య
5. శ్రీశ్రీశ్రీ జగద్గురు శివయోగీంద్ర శివాచార్యులు
6. శ్రీశ్రీశ్రీ జగద్గురు త్రయంబక శివాచార్య
7. శ్రీశ్రీశ్రీ జగద్గురు శివానంద శివాచార్య
8. శ్రీశ్రీశ్రీ జగద్గురు మారుళసిద్ధ శివాచార్య
9. శ్రీశ్రీశ్రీ జగద్గురు అమితానంద శివాచార్య
10. శ్రీశ్రీశ్రీ జగద్గురు నీలగ్రీవ శివాచార్య
11. శ్రీశ్రీశ్రీ జగద్గురు నందీశ్వర శివాచార్యులు
12. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు గురురాజ శివాచార్యులు
13. శ్రీశ్రీశ్రీ జగద్గురు మహాదేవ శివాచార్య
14. శ్రీశ్రీశ్రీ జగద్గురు మయంత శివాచార్య
15. శ్రీశ్రీశ్రీ జగద్గురు గురుశాంత శివాచార్య
16. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు వృషభధ్వజ శివాచార్య
17. శ్రీశ్రీశ్రీ జగద్గురు వీరవృషభేంద్ర శివాచార్యులు
18. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు రెండవ మల్లికాజరు శివాచార్యులు
19. శ్రీశ్రీశ్రీ జగద్గురు శివలింగ శివాచార్య
20. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు II సిద్ధేశ్వర శివాచార్య
21. శ్రీశ్రీశ్రీ జగద్గురు లింగానంద శివాచార్య
22. శ్రీశ్రీశ్రీ జగద్గురు సోమేశ్వర శివాచార్యులు
23. శ్రీశ్రీశ్రీ జగద్గురు ముక్తినాథ్ శివాచార్య
24. శ్రీశ్రీశ్రీ జగద్గురు వామదేవ శివాచార్య
25. శ్రీశ్రీశ్రీ జగద్గురు జగదీశ్వర శివాచార్య
26. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లిఖార్జునశివాచార్యులు
27. శ్రీశ్రీశ్రీ జగద్గురు విశ్వేశ్వర శివాచార్య
28. శ్రీశ్రీశ్రీ జగద్గురు మహేశ్వర శివాచార్యులు
29. శ్రీశ్రీశ్రీ జగద్గురు అఘోర శివాచార్య
30. శ్రీశ్రీశ్రీ జగద్గురు చెన్నవీర శివాచార్యులు
31. శ్రీశ్రీశ్రీ జగద్గురు జటాసిద్ధ శివాచార్య
32. శ్రీశ్రీశ్రీ జగద్గురు గంగాధర శివాచార్య
33. శ్రీశ్రీశ్రీ జగద్గురువు సిద్దవీర శివాచార్యులు
34. శ్రీశ్రీశ్రీ జగద్గురు రుద్రేశ్వర శివాచార్య
35. శ్రీశ్రీశ్రీ జగద్గురు శాంతలింగ శివాచార్య
36. శ్రీశ్రీశ్రీ జగద్గురు వై|| నందీశ్వర శివాచార్య
37. శ్రీశ్రీశ్రీ జగద్గురు గంగాధర శివాచార్య
38. శ్రీశ్రీశ్రీ జగద్గురు మహాలింగ శివాచార్య
39. శ్రీశ్రీశ్రీ జగద్గురు పంచానన శివాచార్య
40. శ్రీశ్రీశ్రీ జగద్గురు బిల్వదలభూషణ శివాచార్య
41. శ్రీశ్రీశ్రీ జగద్గురు మరమర్దన శివాచార్య
42. శ్రీశ్రీశ్రీ జగద్గురు నాగభూషణ శివాచార్య
43. శ్రీశ్రీశ్రీ జగద్గురువు శ్యామకంద శివాచార్య
44. శ్రీశ్రీశ్రీ జగద్గురు చంద్రశేఖర శివాచార్య
45. శ్రీశ్రీశ్రీ జగద్గురు గురుసిద్ధ శివాచార్య
46. శ్రీశ్రీశ్రీ జగద్గురు భవహర శివాచార్య
47. శ్రీశ్రీశ్రీ జగద్గురు చండేశ్వర శివాచార్యులు
48. శ్రీశ్రీశ్రీ జగద్గురు అమృతేశ్వర శివాచార్య
49. శ్రీశ్రీశ్రీ జగద్గురు సుజ్ఞానశేఖర శివాచార్య
50. శ్రీశ్రీశ్రీ జగద్గురు సిద్ధలింగ శివాచార్యులు
51. శ్రీశ్రీశ్రీ జగద్గురు శేషభూషణ శివాచార్య
52. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరానంద శివాచార్య
53. శ్రీశ్రీశ్రీ జగద్గురు మహామల్లికాజారుణ శివాచార్య
54. శ్రీశ్రీశ్రీ జగద్గురువు శంబులింగ శివాచార్య
55. శ్రీశ్రీశ్రీ జగద్గురు శివయోగ ప్రభాకర శివాచార్య
56. శ్రీశ్రీశ్రీ జగద్గురు చిన్మహోదధి శివాచార్య
57. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు శివజ్ఞాన సంజీవుల శివాచార్యులు
58. శ్రీశ్రీశ్రీ జగద్గురు గణేంద్రమందార శివాచార్య
59. శ్రీశ్రీశ్రీ జగద్గురు సిద్ధేశ్వర శివాచార్య
60. శ్రీశ్రీశ్రీ జగద్గురు పరసిద్ధేశ్వర శివాచార్య
61. శ్రీశ్రీశ్రీ జగద్గురు మహంతదేవ శివాచార్య
62. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లిఖార్జునశివాచార్యులు
63. శ్రీశ్రీశ్రీ జగద్గురు వృష్టిశంకర శివాచార్య
64. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంబులింగ శివాచార్యులు
65. శ్రీశ్రీశ్రీ జగద్గురు మదనారి శివాచార్య
66. శ్రీశ్రీశ్రీ జగద్గురు మాయాకోలాహల శివాచార్య
67. శ్రీశ్రీశ్రీ జగద్గురు శివలీలా శివాచార్య
68. శ్రీశ్రీశ్రీ జగద్గురు పంచాక్షర శివాచార్య
69. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లిఖార్జునశివాచార్యులు
70. శ్రీశ్రీశ్రీ జగద్గురు ముక్తినాథ్ శివాచార్య
71. శ్రీశ్రీశ్రీ జగద్గురు మహాదేవ శివాచార్య
72. శ్రీశ్రీశ్రీ జగద్గురు భగరోదేవ శివాచార్య
73. శ్రీశ్రీశ్రీ జగద్గురు బాలసిద్ధేశ్వర శివాచార్య
74. శ్రీశ్రీశ్రీ జగద్గురు చెన్నవృషబ్ శివాచార్య
75. శ్రీశ్రీశ్రీ జగద్గురు వృద్ధవృషభేంద్ర శివాచార్య
76. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు చెన్నమల్లిఖార్జునశివాచార్యులు
77. శ్రీశ్రీశ్రీ జగద్గురువు ముక్తిమల్లిఖార్జునశివాచార్యులు
78. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు సిద్ధమల్లిఖార్జునశివాచార్యులు
79. శ్రీశ్రీశ్రీ జగద్గురు ఏకోదేవ శివాచార్య
80. శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆచార్యభాస్కర శివాచార్య
81. శ్రీశ్రీశ్రీ జగద్గురు మోక్షేశ్వర శివాచార్యులు
82. శ్రీశ్రీశ్రీ జగద్గురు సిద్ధవీరేశ శివాచార్య
83. శ్రీశ్రీశ్రీ జగద్గురు భద్రేశ్వర శివాచార్య
84. శ్రీశ్రీశ్రీ జగద్గురు అమితానంద శివాచార్య
85. శ్రీశ్రీశ్రీ జగద్గురు షడక్షర శివాచార్య
86. శ్రీశ్రీశ్రీ జగద్గురు భక్తివర్ధన శివాచార్య
87. శ్రీశ్రీశ్రీ జగద్గురు పాషహర శివాచార్య
88. శ్రీశ్రీశ్రీ జగద్గురు మహిమాకర శివాచార్య
89. శ్రీశ్రీశ్రీ జగద్గురు శివలింగ శివాచార్య
90. శ్రీశ్రీశ్రీ జగద్గురు నయనత్రయ శివాచార్య
91. శ్రీశ్రీశ్రీ జగద్గురు విరూపాక్ష శివాచార్య
92. శ్రీశ్రీశ్రీ జగద్గురు మరుళసిద్ధ శివాచార్య
93. శ్రీశ్రీశ్రీ జగద్గురు మహంతమల్లిఖార్జునశివాచార్యులు
94. శ్రీశ్రీశ్రీ జగద్గురువు వృష్టిమల్లిఖార్జునశివాచార్యులు
95. శ్రీశ్రీశ్రీ జగద్గురు శివలింగ శివాచార్య
96. శ్రీశ్రీశ్రీ జగద్గురు బృహచ్చెన్నవీర శివాచార్య
97. శ్రీశ్రీశ్రీ జగద్గురువు పరచెన్నవీర శివాచార్య
98. శ్రీశ్రీశ్రీ జగద్గురు సిద్ధలింగ శివాచార్యులు
99. శ్రీశ్రీశ్రీ జగద్గురు మరుళసిద్ధ శివాచార్య
100. శ్రీశ్రీశ్రీ జగద్గురు జటాగురుసిద్ధ శివాచార్య
101. శ్రీశ్రీశ్రీ జగద్గురు చెన్నవృషభ శివాచార్య
102. శ్రీశ్రీశ్రీ జగద్గురు సిద్ధలింగ శివాచార్యులు
103. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు చెన్నవీర శివాచార్యులు
104. శ్రీశ్రీశ్రీ జగద్గురు చెన్నవృషభ శివాచార్య
105. శ్రీశ్రీశ్రీ జగద్గురు గురుసిద్ధ శివాచార్య
106. శ్రీశ్రీశ్రీ జగద్గురు మరుళసిద్ధ శివాచార్య
107. శ్రీశ్రీశ్రీ జగద్గురు చెన్నవృషభ శివాచార్య
108. శ్రీశ్రీశ్రీ జగద్గురు సిద్ధలింగ శివాచార్యులు
109. శ్రీశ్రీశ్రీ జగద్గురు సిద్ధేశ్వర శివాచార్య
110. శ్రీశ్రీశ్రీ జగద్గురు మరులారాధ్య శివాచార్య
111. శ్రీశ్రీశ్రీ జగద్గురు మారుళసిద్ధ రాజదేశికేంద్ర శివాచార్య
ఉజ్జయిని పీఠ గురుపరంపర:
శ్రీశ్రీశ్రీ జగద్గురు మరుళారాధ్య శివాచార్య భగవత్పాద
శ్రీశ్రీశ్రీ జగద్గురు మరుళసిద్ధ రాజదేశికేంద్ర శివాచార్య
CONTACT US
admin@veerashaivadharmam.com