రంభాపురి పీఠమునకు కొలనుపాక మూలస్థానమైనను నేడది కర్ణాటక రాష్ట్రము నందలి చిక్కమంగళూరు జిల్లాలోని బాళెహోన్నూరు సమీపమున విరాజమానమై ప్రకాశించుచున్నది. ఇది వీరసిమ్హాసనమునకు చెందినది. గోత్రపురుషుడు వీరభడ్రుడగుటచే ఈ పీఠమునకు చెందినవారు వీరగోత్రీయులు అగుచున్నారు. పడ్విది సూత్రధారులు. స్వర్ణకమండలమును చేపట్టి అశ్వద్ద (రావి) దండాదారులై ఆకుపచ్చ పతాకదారులై సంచరింతురు. ఈ సూత్రమే గాక పురాణ, పచ్చకంధ మొదలగు పండ్రెండు ఉపసూత్రములును గలవు.'న 'కార ప్రణవాక్షర సంపన్నులు.

ఈ క్షేత్రము సువిశాల ప్రదేశముననున్నది. ఇచట వాతావరణము ప్రశాంతమైనది. గోత్రపురుషుని ప్రాచీన దేవాలయము కలదు. ఆస్వామికి కుడిప్రక్క సోమేశ్వర లింగము, ఎడమప్రక్క రేవణసిద్దులు ఆది శంకరాచార్యులకు ఇచ్చిన చంద్రమౌళీశ్వర లింగయుత మూర్తి మందిరము, మఖమంటపమున స్తంభముపై జగద్గురు వీర రుద్రముని శివాచార్యులు గీసిన నంది విగ్రహము చూడముచ్చటగా యున్నది.

ఆ నంది ఉబ్బెత్తుగా ముందునకు వచ్చుచు వెలికి వచ్చిననాడు భూగర్భసంజాత రుద్రముని శివాచార్యులు తిరిగి ఉద్భదమంది పీఠారోహణము చేతురని కాలజ్ఞానవచనము కలదు. ఆలయం వెనుక భూగర్భసంజనీత రుద్రముని శివాచార్య భగవత్పాదుల జీవసమాధి, ఆప్రక్కన వరుసగా పూర్వపు జగద్గురుల సమాధులు అటు నుండి ముందునకు సాగిన వీరభద్రస్వామి అనుజాత చౌడేశ్వరిమాత ఆలయం, దానిప్రక్కనే ప్రసాద (దాసోహ) నిలయము, దానిప్రక్కనే శ్రీ రేణుకాచార్య మందిరము, దానిపై భాగమున శ్రీజగద్గురు భక్త సందర్శన ప్రదేశము, దాని ప్రక్కనే సంస్కృత వేద జ్యోతిషాధ్యయనము చేయు విద్యార్థుల బస, ముందుభాగమున కార్యాలయము గలవు.

ఈ మందిరము దాటగానే రుద్రముని జ్యోతి, గంగాధర జ్యోతి, శివానంద జ్యోతి మున్నగు ఆధునిక కట్టడముల ముఖద్వారములు గలవు. ఈ ప్రాంగణమున సుమారు 2000లకు పైగా విద్యార్థులు జ్యోతిషము, వైదికము, సంస్కృతము అభ్యసించువారు గలరు. వీరేగాక ఆధునిక విద్యా సంస్థలును గలవు. నిత్యము యాత్రీకులు ఎందరో ఇటకేతెంచు చుందురు. ఇప్పటి వరకు ఈ పీఠారోహణ మొనరించిన జగద్గురువులు 121 మందియని టి.బి. రాజయ్య రత్నగర్భగణపతి "చంద్రమౌళీశ్వర లింగమను" కన్నడకృతుల వలన తెలియవచ్చుచున్నది. వర్తమాన జగద్గురువులు ప్రసన్న రేణుక వీర సోమేశ్వర రాజదేశికేద్ర శివాచార్య మహాస్వాములు. వీరికి పూర్వము కలియుగాది యందు జగద్గురు రేవణసిద్ద శివాచార్య భగవత్పాదులు ఆదిగురువులైరి. వీరు పదునెనిమిది కులములకు పదునెనిమిది మఠములను, ఆ మఠములకు గురువులను కొలనుపాకయందే ఏర్పరచిరి. దళితదీన జనోద్దరణ ఆనాడే ఆరంభింపబడినది. వీరి పిదప భూగర్భ సంజనితులగు శ్రీజగద్గురు రుద్రమీశ్వర శివాచార్యులు జగద్గురువులయిరి. ఈ పీఠము నలంకరించిన వారిలో ముక్తి మునీశ్వరులు, ముక్తేశ్వరులు, 113 పీఠాచార్యులను చంద్రశేఖర శివాచార్య మహాస్వాములు, 117 వ పీఠాచార్యులయిన పంచాక్షరీ శివాచార్యులు, 118వ జగద్గురువులను శివానంద రాజేంద్ర శివాచార్య భగవత్పాదులు ప్రసిద్దులు. వీరెల్లరు రంభాపురి పీఠపు కీర్తిని ఉన్నత శిఖరమునకు చేర్చిరి. వీరి సాధన పరిశ్రమ ధర్మదుంధుభిని మ్రోగించినది.

119 వ జగద్గురులుగా శ్రీ ప్రసన్న రేణుక వీర గంగాధర రాజేంద్ర శివాచార్యులు అపర శివావతారులై, సింహగర్జనా సదృశ నుడికారులై "మానవ ధర్మమునకు జయము కలగాలి. ధర్మమునుండియే విశ్వమునకు శాంతి" యను నూతన ధార్మిక ఘోష, శాంతి ఘోషాలను లోకమున కందించినారు. వీరు నిరాడంబరులు. వీరి శివపూజ విలక్షణమయినది. కనులారా చూడవలయునే కాని అవర్ణనీయము వైరాగ్యము వీరవైభవము రెండును సమముగాననుభవించినవారు. వీర సింహాసనముు అనునవి వీరి నామము తోడనే సార్ధకమయ్యేను. వీరు ముక్తి మందిరమున ముక్తినొందిరి.

120 వ జగద్గురువులు ప్రసన్న రేణుక వీర రుద్రముని శివాచార్యులు. వీరు చతుర్భాషా పండితులు. వీరు శ్రీపీఠపు కృషిక్షేత్రమునకు అధిక ప్రాముఖ్యత నిచ్చి కాఫీ తోటలు పెంచిరి. శ్రీపీఠమునందే ఎక్కువ కాలమునుండి రేణుకాచార్య జయంతీ, వీరభద్రస్వామి తిరుణాల మున్నగు కార్యక్రమముల ద్వారా జనులను ఆ పీఠము వైపు ఆకర్షించితిరి.

121 వ జగద్గురువులు ప్రసన్న రేణుక వీర సోమేశ్వర రాజదేశికేంద్ర శివాచార్య భగవత్పాదులుగా 6-2-1992 వ తేదిన వీర రుద్రముని శివాచార్యులు లింగైక్యములయిన పిదప వారి కోరిక మేరకు పీఠారోహణ మొనరించిరి. ఈ పట్టాభిషేకము ఉజ్జయిని, కేదారము, శ్రీశైలము, కాశీజగద్గురువుల దివ్యసన్నిదానమున వేలాది భక్తుల సమీక్షమున జరిగెను. వీరు పీఠమునకు ఒక నూతన ఒరవడిని తెచ్చిరి. ఒక పథకము నేర్పరచిరి.

పీఠమున నిత్యాన్నదానము నడుపుట, పాలన త్వరితము చేయుట, పీఠమున గురుకుల స్థాపనము, శ్రీజగద్గురు రేణుకాచార్య శిక్షణా ప్రతిష్టానము స్థాపించి దాని ద్వార దేశమంతట శిక్షణాసంస్థల ప్రోత్సాహము, వీరశైవ ధార్మిక సాహిత్యము పత్రీకరించి దానిని తక్కువ వేలకే అమ్ముట, జాతీయప్రచార, ప్రసార సాధనములను చక్కగా ఉపయోగించు కొనుట, శ్రావణమాస అనుష్ఠానము పీఠమునందే చేపట్టుట, ప్రతి పూర్ణిమనాడు పీఠాచార్యులు పీఠమునందే యుండి భక్తులకు దర్శనాశీర్వాదము లందజేయుట అనునవి వీరు ఏర్పరచిన పథకము. ఇది ఇప్పటికిని కొనసాగుచునేయున్నది.

వీరు మాటల మనుషులు కారు. చేతలమనుషులు. ప్రతి విషయమును చేసి చూపుదురు. పూర్వశివాచార్యులు ఆదేశించిన పనులన్నింటిని వీరు త్వరితగతిని పూర్తి చేయసాగిరి. పీఠము జీర్ణోద్దరణము గావించిరి. పీఠమున బండపరుపు వేయించిరి. కట్టడములన్నింటిని నూతన ఇధానమునకు మార్చిరి. పీఠమును దర్శించుటకై వచ్చెడు భక్తుల నివాసమునకై రుద్రముని జ్యోతి, శివానందజ్యోతి, గంగాధరజ్యోతి యను పేర్లతో యాత్రీకులకు బసనేర్పరచిరి. పూర్వపు ఆచార్యులు సంచరించని మారుమూల ప్రదేశాల నెన్నింటినో దర్శించి శుభాశీర్వాద సందేశముల నందించుచున్నారు.

మూలస్థానమగు కొలనుపాకను దర్శించిన పిదప అచట ఒక వసతిగృహము నేర్పరిచిరి. ఆలయ జీర్ణోద్దరణము చేయదలచి అత్యంత శ్రమ తీసికొని దానికై ఒక ట్రస్టు నేర్పరచిరి. దాని మూలకంగా కోటిరూపాయల వ్యయంతో 7 ఎకరముల భూమిని సేకరించి దానియందు యాత్ర నివాసమందిరమును నిర్మించిరి. 2007 మే నెలలో పంచ పీఠాధీశులు కర్ణాటక ఆంధ్ర రాజ్యపాలకుల సమీక్షములో ప్రారంభము చేసియున్నారు. శ్రీపీఠము ఉద్దరింపబడినటులే వీరి కరకమలములచే ఆలయోద్దరణము జరుగగలదని ఆశింతుము.

శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు ఏకాక్షర శివాచార్య భగవత్పాద (కృత యుగం)

శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు ఏకవక్ష్య శివాచార్య భగవత్పాద (త్రేతా యుగం)

శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు రేణుకా శివాచార్య భగవత్పాద (ద్వాపర యుగం)

1. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు రేవణసిద్ధ శివాచార్య భగవత్పాద (కలియుగం)

2. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు రుద్రమునీశ్వర శివాచార్య భగవత్పాదులు

3. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు ముక్తిమునీశ్వర శివాచార్య భగవత్పాదులు

4. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు దిగంబర ముక్తిమునీశ్వర

శివాచార్య భగవత్పాదులు

5. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురువు త్రిలోచన శివాచార్య భగవత్పాద

6. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు యోగినాథ శివాచార్య భగవత్పాద

7. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు మృత్యుంజయ శివాచార్య భగవత్పాద

8. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు రుద్రముని శివాచార్య భగవత్పాద

9. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు గురుపాద శివాచార్య భగవత్పాద

10. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు షణ్ముఖ్ శివాచార్య భగవత్పాద

11. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు శివలింగ శివాచార్య భగవత్పాద

12. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు నిత్యానంద శివాచార్య భగవత్పాద

13. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు ముక్తినాథ్ శివాచార్య భగవత్పాద

14. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు షడక్షర శివాచార్య భగవత్పాద

15. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురువులు గురుసిద్ద శివాచార్య భగవత్పాద

16. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు శివలింగ శివాచార్య భగవత్పాద

17. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు నీలకంఠ శివాచార్య భగవత్పాదులు

18. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు కైవల్యానాథ్ శివాచార్య భగవత్పాదులు

19. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు పంచాక్షర శివాచార్య భగవత్పాదులు

20. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు సర్వేశ్వర శివాచార్య భగవత్పాద

21. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురువు శంబుదేవ శివాచార్య భగవత్పాద

22. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువులు కాలక్రమేణా శివాచార్య భగవత్పాదులు

23. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు శాంత్వీర శివాచార్య భగవత్పాద

24. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు ముక్తినాథ్ శివాచార్య భగవత్పాద

25. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు శంకరస్వామి శివాచార్య భగవత్పాదులు

26. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురువు సదాశివ శివాచార్య భగవత్పాద

27. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు మహాదేవ శివాచార్య భగవత్పాద

28. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురువులు గురులింగ శివాచార్య భగవత్పాద

29. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు రేవణసిద్ధ శివాచార్య భగవత్పాద

30. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు పశుపతి శివాచార్య భగవత్పాదులు

31. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురువు శంబులింగ శివాచార్య భగవత్పాద

32. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు గురుపాద శివాచార్య భగవత్పాద

33. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు శ్రీకంఠమూర్తి శివాచార్య భగవత్పాదులు

34. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు సిద్ధనాథ శివాచార్య భగవత్పాద

35. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురు మృత్యుంజయ శివాచార్య భగవత్పాదులు

36. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు నీలకంఠ శివాచార్య భగవత్పాద

37. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు సోమశేఖర శివాచార్య భగవత్పాద

38. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు వీరభద్ర శివాచార్య భగవత్పాద

39. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు జగన్నాథ శివాచార్య భగవత్పాద

40. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు పంచన శివాచార్య భగవత్పాద

41. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు కెంజేడే రాజశేఖర శివాచార్య భగవత్పాదులు

42. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురు నగరరంభ శివాచార్య భగవత్పాదులు

43. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు సిద్ధనాథ్ శివాచార్య భగవత్పాద

44. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు రుద్రమునీశ్వర శివాచార్య భగవత్పాదులు

45. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు కళ్యాణసుందర శివాచార్య భగవత్పాద

46. ​​శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు గంగాధర శివాచార్య భగవత్పాద

47. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురు పంచాక్షర శివాచార్య భగవత్పాదులు

48. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు చిదంబరదేవ శివాచార్య భగవత్పాద

49. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు శివప్రసాద శివాచార్య భగవత్పాదులు

50. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు వీరభద్ర శివాచార్య భగవత్పాద

51. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు శివానంద శివాచార్య భగవత్పాద

52. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువులు అవిముక్త శివాచార్య భగవత్పాద

53. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు రేవనసిద్ద శివాచార్య భగవత్పాద

54. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు మల్లికార్జున శివాచార్య భగవత్పాద

55. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు పశుపతి శివాచార్య భగవత్పాదులు

56. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు రేవణసిద్ధ శివాచార్య భగవత్పాదులు

57. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు ప్రమథనాథ్ శివాచార్య భగవత్పాదులు

58. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు గురుదేవ శివాచార్య భగవత్పాదులు

59. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు గంగాధర శివాచార్య భగవత్పాదులు

60. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు నందినాథ్ శివాచార్య భగవత్పాదులు

61. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు ముక్తిమునీశ్వర శివాచార్య భగవత్పాదులు

62. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురువు శంబుదేవ శివాచార్య భగవత్పాద

63. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు తాండవాలే శివాచార్య భగవత్పాద

64. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు గురుదేవ శివాచార్య భగవత్పాద

65. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురు జటావీరభద్ర శివాచార్య భగవత్పాదులు

66. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు శివలింగ శివాచార్య భగవత్పాదులు

67. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు విరూపాక్ష శివాచార్య భగవత్పాద

68. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు శ్రీకాంత శివాచార్య భగవత్పాద

69. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు అఘోర శివాచార్య భగవత్పాద

70. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు గురు శివాచార్య భగవత్పాద

71. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు ఈశానదేవ శివాచార్య భగవత్పాద

72. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు మల్లికార్జున శివాచార్య భగవత్పాద

73. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు చరలింగ శివాచార్య భగవత్పాద

74. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు మాన్యశ్లోక శివాచార్య భగవత్పాదులు

75. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురువు గంగాధర శివాచార్య భగవత్పాద

76. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు సోమనాథ శివాచార్య భగవత్పాద

77. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురు పృథ్వీజ శివాచార్య భగవత్పాదులు

78. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు వీరేశ్వర శివాచార్య భగవత్పాదులు

79. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువులు ఘంటసిద్ధ శివాచార్య భగవత్పాద

80. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురువులు వృషబేంద్ర శివాచార్య భగవత్పాద

81. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు సదానంద శివాచార్య భగవత్పాద

82. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురువులు గురులింగ శివాచార్య భగవత్పాద

83. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు రుద్రమునీశ్వర శివాచార్య భగవత్పాదులు

84. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు వీరభద్ర శివాచార్య భగవత్పాద

85. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురువు గణనాథ శివాచార్య భగవత్పాదులు

86. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు మల్లికార్జున శివాచార్య భగవత్పాద

87. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు శక్తిధర శివాచార్య భగవత్పాద

88. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు సిద్ధలింగ శివాచార్య భగవత్పాద

89. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు చిత్రాకాశ శివాచార్య భగవత్పాదులు

90. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురువు శంబుదేవ శివాచార్య భగవత్పాద

91. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు రుద్రమునీశ్వర శివాచార్య భగవత్పాదులు

92. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు సారంగధర శివాచార్య భగవత్పాద

93. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు కుమారదేవ శివాచార్య భగవత్పాద

94. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు శివప్రసాద శివాచార్య భగవత్పాదులు

95. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు చంద్రశేఖర శివాచార్య భగవత్పాద

96. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు చన్నవీరదేవమదేవ శివాచార్య భగవత్పాద

97. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు వామదేవ శివాచార్య భగవత్పాదులు

98. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు నీలకంఠదేవ శివాచార్య భగవత్పాదులు

99. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు రేవణసిద్ధ శివాచార్య భగవత్పాదులు

100 శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు శివలింగ శివాచార్య భగవత్పాద

101. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు చిప్పనదేవ శివాచార్య భగవత్పాద

102. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు నాగనాథ్ శివాచార్యులు భగవత్పాద

103. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురువు గంగాధర శివాచార్య భగవత్పాద

104. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు చంద్రశేఖర శివాచార్య భగవత్పాదులు

105. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురు పూర్ణజ్ఞాన శివాచార్య భగవత్పాద

106. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు శంబులింగ శివాచార్య భగవత్పాద

107. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు చిన్నవృషభలింగ శివాచార్య భగవత్పాద

108. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురు జటావృషభలింగ శివాచార్య భగవత్పాద

109. శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శాంతదేవ శివాచార్య భగవత్పాద

110. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువులు గురువృషభరాజేంద్ర

శివాచార్య భగవత్పాదులు

111. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురు పంచాక్షర శివాచార్య భగవత్పాదులు

112. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువులు గురుసిద్ధస్వామి

శివాచార్య భగవత్పాదులు

113. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురువు చంద్రరాజేంద్ర శివాచార్య భగవత్పాదులు

114. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురు చంద్రశేఖరదేశికేంద్ర

శివాచార్య భగవత్పాదులు

115. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు శివానందరాజేంద్ర

శివాచార్య భగవత్పాదులు

116. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు వృషభరాజేంద్ర శివాచార్య భగవత్పాదులు

117. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు పంచాక్షర శివాచార్య భగవత్పాద

118. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు అభినవరేఖక శివానంద

శివాచార్య భగవత్పాదులు

119. శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు ప్రసన్నరేణుక వీరగంగాధర

శివాచార్య భగవత్పాదులు

120. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురు ప్రసన్నరేణుక విరుద్రమునిదేవ

శివాచార్య భగవత్పాద

121. శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు డా.ప్రసన్నరేణుక వీరసోమేశ్వర రాజదేశికేంద్ర శివాచార్య భగవత్పాద

రంభాపురి పీఠ గురుపరంపర:

శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు రేవణసిద్ధ శివాచార్య భగవత్పాద

శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురువు డా.ప్రసన్నరేణుక వీరసోమేశ్వర రాజదేశికేంద్ర శివాచార్య భగవత్పాద