దాతృత్వ సేవ 01:
శ్రీ జగద్గురు పంచాచార్య వీరశైవాగమ వేదసంస్కృత పాఠశాల,
కిషన్ నగర్-షాద్ నగర్, తెలంగాణ
సనాతన వీరశైవ సంస్కృతి, సంప్రదాయములను భావితరాల వారికి అందించాలనే ఉద్దేశ్యంతో శ్రీమద్ కాశీ జగద్గురువులచే స్థాపించబడిన ఈ వేదపాఠశాల, నేడు వందలాది జంగమ విద్యార్థులు ఈ పాఠశాల యందు ఉత్తమమైన వేదవిద్యను అభ్యసించి తమ జీవనోపాదితో పాటు మన సాంస్కృతి, సంప్రదాయాల ప్రకారము పూజాకార్యక్రమాలు నిర్వహించి భావితరాలకు మార్గదర్శకులవుతున్నారు.
వేదాగమ శాస్త్రములందు నిష్ణాతుడు సంగయ్య స్వామి గారిని అధ్యాపకునిగా మరియు వేదాగమ పండితులు డా||మహాంతయ్య స్వామి గారి పర్యవేక్షణలో విద్యను బోధించటం జరుగుచున్నది. అదేవిధంగా కొంతమంది సేవాతత్పరులచే పాఠశాల నిర్వాహణ కమిటీని ఏర్పాటు చేసినారు.
వీరశైవ ధర్మమందు దాసోహానికి అధిక ప్రాధాన్యత కలదు. కర్ణాటకలో అనేక మఠములందు ఉచిత దాసోహం వలన వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసించుచున్నారు. నేటి ఆధునిక యాంత్రిక జీవనమునందు సమయాభావం వలన మనవారు కొంత వరకు ఈ దాసోహమునకు దూరముగా ఉండవలసి వస్తున్నది. మన ధర్మం పాఠించే అవకాశము కలగటం లేదు. అందులకు గాను అందరికి ఉపయోగకరంగా కొన్ని కార్యక్రమాలను మన సౌకర్యం కొరకు మరియు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు, వీరశైవ ధర్మోధ్ధరణలో మనలను భాగస్వాములను చేయుటకు పాఠశాల మనకు ఒక సదవకాశమును కల్పించినది.
మన (1) పుట్టినరోజు (2) వివాహ వార్షికోత్సవం (3) పెద్దల సంవత్సరీకం, (4) లింగదీక్ష కార్యక్రమము, మరియు (5) కాశీ విశ్వనాథునికి అభిషేకము వంటి కార్యక్రమములు నిర్వహించుటకు వేద పాఠశాల కు రూ||2500/- చెల్లించినచో వంద మంది విద్యార్థులకు అన్నదానము మన పేరు వీద మనం కోరుకున్న రోజున మన కుటుంబ సభ్యులతో శాస్త్రొక్తంగా జరుపబడును. దూరప్రాంతముల నుండి రాలేని వారు, తమ వివరాలు తెలియపరచినచో ఆ రోజున మీపేరుపై అన్నదాన కార్యక్రమము జరుపబడును.
అదియే గాక, పాఠశాల అభివృద్ధి కొరకు, ధన, వస్తు రూపేణ విరాళములు ఇవ్వవచ్చును. శ్రీ కాశీ విశ్వనాధ మరియు శ్రీ ఆది జగద్గురువుల కృపకు పాత్రులు కాగలరు.
విరాళములు పంపుటకు బ్యాంక్ అకౌంట్ వివరాలు.
SRI JAGADUGURU VISHWARADHYA EDUCATIONAL & CHARITABLE TRUST
BANK OF BARODA
AC NO: 08000100006149
BRANCH: SHADNAGAR, DIST: RANGAREDDY
IFSC CODE: BARBOSHADNA
పూర్తి వివరములకు శ్రీ సంగయ్య స్వామి, అధ్యాపకులు, శ్రీ జగద్గురు పంచాచార్య వీరశైవాగమ వేదసంస్కృత పాఠశాల, కిషన్ నగర్-షాద్ నగర్, తెలంగాణ వారిని సంపద్రించండి.
వారి ఫోను నంబరు: 8374822903
CONTACT US
admin@veerashaivadharmam.com