శ్రీశైలము ద్వాదశ జ్యోతిర్లింగములందొకటైన శ్రీ మల్లికార్జున శివలింగము, అష్టాదశ శక్తి పీఠములలో నొకటగు భ్రమరాంబ సన్నిదానము ప్రత్యక్ష కైలాస సదృశ్యమై సుందరమై ప్రకాశించుచున్నది .
సుధా కండాఖ్య సుక్షేత్ర మల్లికార్జున లింగిత:
జననం పండితార్యాస్య నివాస: శ్రీగిరే శివే||
వృషగోత్రాధి నాధశ్చ సిమ్హాసన పతిశ్చయ:
పండితారాధ్య సన్నామ జగద్గురు తమెశ్చస:|| (స.భేదాగమము)
పై ఆగమ వచనానుసారమున శ్రీగిరియందే ఉధ్బవమంది అచటనే నివాస మేర్పరచుకొనిరి. దీనిని శ్రీశైల పీఠము లేక సూర్యసింహాసనమని పిలుతురు. కలియుగము నందు శ్రీజగద్గురు పండితారాధ్యులని పిలువబడుతున్నారు.
స్కంద పురాణాంతర్గత విషయము నవలోకించి నపుడు శ్రీశైల పీఠమెంతటి ప్రాచీనమైనదో తెలియగలదు. పంచాచార్యులు కాశీక్షేత్రమునకు సందర్శించినట్లుగా పంచాచార్యుల శిల్పము ఉత్తర ప్రాకార కుడ్యముపై యున్నది. పంచపీఠములున్నవి. విభూతి ఘంటా రుద్రాక్ష సారంగమఠములున్నవి. ఆయా పీఠాధిపతులు వారి వారి మథములలో విశ్రాంతి పొందెడివారని తెలియగలదు. నేడు అవి పాడు పడినవి. వీనిని ఉద్దరింపవలసిన భాధ్యత పీఠాధిపతులగు పంచాచార్యులపైనే యున్నది
ఈ పీఠమునకిప్పటి శాసన ఆధారముల వలనను, దానపత్రముల వలన 27 మంది ఆచార్యులున్నట్లు తెలియగలము. వీరు వృషభ గోత్రీకులు. ముక్తాగుచ్చ సూత్రీయులు. ఇదియే గాక త్రిపుటి చంద్రకుండ రామగిరి భస్మగిరి మొదలగు ఉపసూత్రములు పండ్రెండు గలవు. 'వ ' కార ప్రణవాక్షరులు. లోహకమండల ధారులై న్యగ్రోధ (మఱ్ఱ) దండమును ధరించి శ్వేతపతాకధారులై ధర్మప్రచారము సాగించుచుందురు. ఈ పీఠమునకు ఎందరో రాజులు సామంతులు పీఠమునందు అమిత భక్తి గలిగిన భక్తవరులు ఎన్నియో దానమొనరించినట్లు శాసనముల వలన తెలియుచున్నది.
8వ శతాబ్దమున వేయించిన జమ్మిదొడ్డి శాసనము 12వ శతాబ్దినాటి తాటిపత్రి శాసనము, పాణ్యము శాసనము, 14వ శతాబ్దమున వేయించిన రెండవ ప్రతాపరుద్రుని శాసనము ఇవియేగాక అనేకానేక రాగిశిలా శాసనౌలు పీఠాభివ్ర్ద్దికిని, శ్రీ మల్లికార్జునస్వామి పూజాకైంకర్యములు చేయించుటకు జగద్గురువులకు ఇచ్చినట్లు గలవు.
శ్రీపతి పండితారాధ్య్లు, మల్లిఖార్జున పండితారాధ్యులు, మంచన పండితారాధ్యులు చాలా గొప్పవారు. వీరు రచనలును చాలా గొప్పవి. వీరు మహామహిమాన్వితులు. శాపానుగ్రహదక్షులు. అగ్నిస్తంభన, జలస్తంభన మున్నగు విద్యలు తెలిసినవారు. శ్రీకర భాష్యము, శివతత్వసారము, శివమహిమ మున్నగు గ్రంథములు వ్రాసినవారు. శ్రీమల్లిఖార్జున పండితారాధ్యుల సమాధియు నేడు భ్రమరాంబ ఆలయము భాగమున చూడదగును.
ఈ పీఠగురుపరంపరయందు శ్రీ జగద్గురు శంకర శివాచార్య భగవత్పాదులు, ఈశ్వర శివాచార్య భగవత్పాదులు, పట్టద ప్రమధేశ్వర శివాచార్యులు, శ్రీలింగ చక్రేశ్వర శివాచార్య భగవత్పాదులు, పట్టద పర్వత రాజ శివాచార్య భగవత్పాదులు, జడే శంకర శివాచార్య భగవత్పాదులు ముఖ్యులు. వీరెల్లరు శాపానుగ్రహ దక్షులు, ఉపాసనాపరులు, శక్తిమహిమాన్వితులు, భక్తాభీష్టములు నెరవేర్చేడువారు.
శ్రీజడెశంకర శివాచార్య భగవత్పాదులు ఒకమారు రంభాపురి వెళుతూ మార్గమధ్యమున తుంగభద్ర యుప్పొంగుటచే నావికులు దాటించ తిరస్కరింప కంబళిని నీలిని ఏర్పరచ్గు దానిపై శిష్యగణముతో నదిని దాటారట, అది చూసిన అందరు ఆశ్చర్యచకితులయినారట. ఆ నదీ తీరప్రదేశమును ఇప్పటికి 'కీదీహోళె ' యని పిలుతురు. జగద్గురువులు నదిని దాటినపిదప బిదిరిహళ్ళి గ్రామము చేరిరి. ఆకతాయి జనులు స్వామి చెంతకేతెంచి, కొందరు ప్రణమిల్లి, మరికొందరు పరీక్షింపనాశ కలిగి ఎండిన రావిచెట్టును చిగురింపవేడిరి. ముప్పది దినములు వేచియుండుడు అని రంభాపురి కేగి తిరివి వచ్చుచు యాప్రదేశము చేరి 'శివేచ్చ ' యని కమండలములోని జమును ఆ ఎండిన చెట్టుపై చిలకరించిరి. చెట్టు చిగురించుటయే గాక బంగారు వాన కురిసెను. చెట్టు చిగురించుట చేతను, బంగారు వాన కురియుట చేతను ఆగ్రామము హోన్నరళిగా మారెను. నేడది హోన్నాళిగా పిలవబడుచున్నది.
జగద్గురు నాగలూటి భిక్షావర్తి శివాచార్య భగవత్పాదులు పీఠారోహకులయిరి. వీరు నిష్టాగరిష్ఠులు, సత్యశీలురు, తత్వప్రేమికులు. పీఠపు క్రియాశక్తి పెంపొందింప పాటుపడిరి. వీరి సమయముననఏ పీఠము న్యాలాలయమునకు గురియయ్యేను. వ్యాజ్యముల నేవియు వదలక పోరాడిరి. ఇహలోక యాత్ర వీడక మునుపే 24 దినములు ముందుగా 7-7-1940వ తేదిన శ్రీ జగద్గురు వాగీశ పండితారాధ్యులకు గంతకల్లు పట్టణమున పట్టముకట్టి ఆపై దేహయాత్ర చాలించిరి.
వీరి హయామున పీఠమునకు శ్రీశైల క్షేత్రమునకు రెంటికిని గ్రహణము పట్టినత్లయి యుండెను. వీరి హయాముననే దోరణాల నుంచి శ్రీశైలము వరకు చక్కని రాజమార్గము ఏర్పాటయ్యేను. మొట్టమొదటి శ్రీశైల జీర్ణోద్ధారణ సంఘపు అధ్యక్ష పదవి నలంకరించిరి. ఇది 2-6-1956 న జరిగినది. సభయందు గైకొన్న నిర్ణయము మేరకు భారతదేశము నందలి అనేక రాష్ట్రములు సంచరించి ధనము నిధిగా సేకరించి వసతిగృహములు నిత్యాన్నదాన శాశ్వత పథకములు, విశ్రాంతి మంటపములు, చలివేంద్రాలు నిర్మింప చేసిరి. వీరు జన్మత: ప్రతిభావంతులు, వరకవులు, వక్తలు, ఆశుకవులు, అయుర్వేద విద్యావిశారదులు, సమతావాదులు. దూరదృష్టి కలిగిన వీరు 16-12-1981వ సంవత్సరమున ఉమాపతి పండితారాధ్యులకు పట్టాము పట్టిరి. వారుండగనే పీఠకార్యక్రమములన్నింటిని వారిచేతనే నడిపించిరి.
ఉమాపతి పండితారాధ్యులు ఇప్పటి జగద్గురువులు వారికి హుబ్బిళ్ళ యందు పట్టాభిషేక రజతోత్సవము జరిగినది. ఈ సభకు మిగతా జగద్గురువులతో బాటు ఎందరో రాజకీయ నేతలు, భారత ప్రధానులు ఏతెంచిరి. వీరు 10-3-1949 సం||న జన్మిచిరి. కష్టపడి చదివిరి. ప్రవచనములు పురాణ కాలక్షేపము చేసి ధనమార్జించి స్వసంపాదన పైనే విద్యనభ్యసించిరి. కాశీపూర్ణానంద విశవిద్యాలయం నుండి సాహిత్యరత్న, కాశీ విశ్వవిద్యాలయం నుండి ఏం.ఎ. డిగ్రీలు పొందిరి. పీఠాధిపతులు అయిన పిదప ఎన్నియో వ్యాజ్యములను గెలిచిరి. వారేదన్ కొందురో దానిని తప్పక పూర్తి చేయుదురు. దేవస్థానము చెంత భవ్యద్వజస్థంభము అమ్మవరి గోపురముపై పసిడి కలశములు ప్రతిష్టించిరి సిఖరమునందు విద్యుల్లింగము నేర్పరచిరి. దావణగేరె యందు వాగీశ పండితారాధ్యుల పుణ్యతిధి భాద్రపద మాసమున జరుపుదురు.
నూతన శ్రీశైల జగద్గురు సూర్య సింహాసనాధీశ్వరులు శ్రీ1008 జగద్గురు
డా||చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వాముల పరిచయము
శ్లో|| శ్రీశైల శిఖరం దృష్ట్య పునర్జన్మ నవిద్వతే| శ్రీశైల సమక్షేత్రే నభూతో నభవిష్యతి||.
అనే శ్లోకము వేదకాలము నుండియే శ్రీశైలక్షేత్రము యొక్క శిఖరం యొక్క దర్శనమే ముక్తి భాగ్యము గలుగునని మరియు శ్రీశైల క్షేత్రమంతటి క్షేత్రము ఇంకొకటి లేదని తెలియపరచినది. ఇంతటి పవిత్ర క్షేత్రమున గల వీరశైవ పంచపీఠముల యందుగల ఒక సూర్య సింహాసనాన్ని అధిష్టించిన శ్రీ జగద్గురు డా||చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వాములవారు బాగల్ కోట్ జిల్లా జమఖండి తాలూకా, హిప్పరిగి గ్రామమున 28-11-1971 లో మడివాళయ్య హిరేమఠం, లక్ష్మీ సౌభాగ్యవతి శారద హిరేమఠ్ లపుణ్యదంపతులకు పుత్రులై జన్మించిరి. వీరశైవ సదాచార సంపన్న కుటుంబము వీరిది. వీరు తమ ప్రాథమిక శిక్షణ, మాధ్యమిక శిక్షణ హిప్పరిగి యందు ఇళకల్ నందు పూర్తిచేసిరి. ఉన్నత విద్యను కాశీలో ఆదర్శ శ్రీసాంగసంస్కృత బ్రహ్మవిద్యా మహావిద్యాలయమున, 1994 మరియు 1996 లో శక్తి విశిష్టాద్వైత వేదాంత శాస్త్రము, రెండవది శక్తి విశిష్టాద్వైత వేదాంతాచార్య విషయమునందు, అనంతరం 1998లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయమున ఎం.ఎ.కన్నడ పట్టా పొందినారు.
పరిశోధన యందు శ్రీజగద్గురువులు శ్రీమద్ భగవద్గీతా మరియు శ్రీ సిద్ధాంత శిఖామణి ఒక తులమానిక సమీక్షా చేసి సంస్కృతమున 2002లో కాశీ బనారస్ హిందూ విశ్వవిద్యాలయము నుండి పి.హెచ్.డి. పట్టా పొందినారు. అనేక ధర్మాలపై, సమాజములపై అవగాహన కలిగిన వీరు సాహిత్య రచనలు"షట్ స్థలములు" గ్రంథం, "శైవాగములో మహిళ", వీరశైవము మరియు భగవద్గీతపై అనేక వ్యాసములు వ్రాయడం జరిగినది. వీరి శిక్షణ కాలమున మూడు బంగారు పధకములు సాధించినారు. ఎన్నో పరిశోధనాత్మకమైన కన్నడ గ్రంధములు రచించడమైనది.
శ్రీజగద్గురువుల వారు 2003 లో హిప్పరిగి హిరేమఠము యొక్క అధికారము స్వీకరించి, అనంతరం 2004లో యడూరు శ్రీ కాడసిద్ధేశ్వర సంస్థాన మఠమునకు పట్టాధికారులై, మఠంలో యున్న శ్రీవిరూపాక్ష లింగ దేవస్థానమును ధర్మస్థల పుణ్యక్షేత్రముగా అభివృద్ధి వీరి ద్వారానే జరిగినది.
వీరు తమ యొక్క ప్రతిభా సామర్ధ్యముతో అనేక రంగాలలో అపారమైన అనుభవము పొందినారు. శ్రీ జగద్గురువులు ఈనాడు భూకైలాసంగా పిలువబడే శ్రీశైల పీఠమును అధిరోహించి సమాజమున గల అసమానతలు తొలగించి భిన్నత్వంలో ఏకత్వం సాధించి అందరిని ఒకే వేదికపైకి తీసుకు వస్తారని ఆశిద్దాం.
ఈనాడు సనాతన ధర్మంపై మన సంస్కృతి సంప్రదాయాలు తెలియపరచి సమాజ పరివర్తనకు భక్తి నుండియే ముక్తికి మార్గం అని తెలియాలి. ఆధునిక సమాజమున యువకులు ముందుకు రావాలి. ఇతర సమాజములకు మార్గదర్శకం కావాలి. దీనికి ధర్మాచరణం, సంప్రదాయం, విద్యా, మనలో ఐక్యత పెరగాలి. వీటి కొరకు వివిధ జిల్లాలలోని సమాజములు, పెద్దలు తమవంతు కృషి చేయవలసిన అవసరం, కార్యక్రమాల నిర్వాహణ ద్వారా సాధించవచ్చును. మన జీవనశైలికి భక్తిరసము నిండి రాష్ట్రంలో యున్న అందరికి ముక్తి ప్రసాదించాలి.
శ్రీశైల సూర్యసింహాసన పీఠం జగద్గురువుల వారసత్వం
శ్రీశ్రీశ్రీ జగద్గురు చతురాక్షర శివాచార్య భగవత్పాద (కృత యుగపు ఆది)
శ్రీశ్రీశ్రీ జగద్గురు చతుర్వక్త్ర శివాచార్య భగవత్పాద (త్రేతా యుగపు ఆది)
శ్రీశ్రీశ్రీ జగద్గురు ధేనుకర్ణ శివాచార్య భగవత్పాద (ద్వాపర యుగపు ఆది)
శ్రీశ్రీశ్రీ జగద్గురు పండితారాధ్య శివాచార్య భగవత్పాద (కలియుగం యొక్క ఆది)
1. శ్రీశ్రీశ్రీ జగద్గురు సదానంద శివాచార్య
2. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లిఖార్జున శివాచార్య (క్రీ.శ. 940)
3. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకర శివాచార్యులు
4. శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీపతి పండితారాధ్య శివాచార్య (క్రీ.శ. 1060)
5. శ్రీశ్రీశ్రీ జగద్గురు గజకర్ణ శివాచార్య
6. శ్రీశ్రీశ్రీ జగద్గురు సంగం శివాచార్య
7. శ్రీశ్రీశ్రీ జగద్గురువు త్రిరంగుష్ట శివాచార్య
8. శ్రీశ్రీశ్రీ జగద్గురు అవ్యయ శివాచార్య
9. శ్రీశ్రీశ్రీ జగద్గురు కల్యాణపండిత్ శివాచార్య
10. శ్రీశ్రీశ్రీ జగద్గురు ఉమాధవ శివాచార్య
11. శ్రీశ్రీశ్రీ జగద్గురు ప్రభు శివాచార్య
12. శ్రీశ్రీశ్రీ జగద్గురు గోకర్ణ శివాచార్య
13. శ్రీశ్రీశ్రీ జగద్గురు మంచన్ పండితారాధ్య శివాచార్య
14. శ్రీశ్రీశ్రీ జగద్గురువు సురేష్ శివాచార్య
15. శ్రీశ్రీశ్రీ జగద్గురువు మల్లిఖార్జున శివాచార్యులు
16. శ్రీశ్రీశ్రీ జగద్గురు మల్లిఖార్జుల పండితారాధ్య శివాచార్య (క్రీ.శ. 1195)
17. శ్రీశ్రీశ్రీ జగద్గురు ఈశ్వర శివాచార్య (క్రీ.శ. 1300)
18. శ్రీశ్రీశ్రీ జగద్గురు పట్ట ప్రమథేశ్వర శివాచార్య (క్రీ.శ. 1700)
19. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు సిద్ధమల్లిఖార్జున శివాచార్యులు
20. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు త్రిలింగ చక్రేశ్వర శివాచార్య
21. శ్రీశ్రీశ్రీ జగద్గురు సిద్ధభిక్షావతారి శివాచార్య
22. శ్రీశ్రీశ్రీ జగద్గురువులు నాగలూటి భిక్షావతారి శివాచార్యులు (క్రీ.శ. 1908-1940)
23. శ్రీశ్రీశ్రీ జగద్గురు వాగీశ పండితారాధ్య శివాచార్య (1940-1986 AD)
24. శ్రీశ్రీశ్రీ జగద్గురు ఉమాపతి పండితారాధ్య శివాచార్య (క్రీ.శ. 1981)
ప్రత్యేక గమనిక: ఎందరో జగద్గురువులు సనాతనవాద శ్రీశ్రీశ్రీ శైల పీఠానికి వెళ్లారు. అయితే ఈ వారసత్వానికి చెందిన ఎందరో జగద్గురువుల పేర్లు, చరిత్రలు కాలగర్భంలో మరుగున పడి ఉండడం వల్ల దొరికినవి మాత్రమే ప్రచురించబడ్డాయి.
శ్రీశైల పీఠ గురుపరంపర:
శ్రీశ్రీశ్రీ జగద్గురు పండితారాధ్య శివాచార్య భగవత్పాద
శ్రీశ్రీశ్రీ జగద్గురు డా||చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వాముల
CONTACT US
admin@veerashaivadharmam.com