శివస్మరణము 01
అనేక మూర్తుల ఆదిదేవుడు అనవతరం మమ్మాదుకునే శివుడు
అనేక మూర్తుల ఆదిదేవుడు అనవతరం మమ్మాదుకునే శివుడు
జ్ఞాన సుధలు కురిపించే గురువు, దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
జ్ఞాన సుధలు కురిపించే గురువు, దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి
హరాతి వర్గమును అంతము చేయును పరాక్రమమున కిరాతమూర్తి
అనేక మూర్తుల ఆదిదేవుడు అనవతరం మమ్మాదుకునే శివుడు
కనుబొమల నడుమ కనిపించినది కాశీ లింగం జ్యోతిర్మూర్తి
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
కనుబొమల నడుమ కనిపించినది కాశీ లింగం జ్యోతిర్మూర్తి
ప్రకృతిపురుషాత్మక స్త్రీ తత్వము అర్థనారీశ్వరాద్భుత మూర్తి
అనేక మూర్తుల ఆదిదేవుడు అనవతరం మమ్మాదుకునే శివుడు శివుడు
నాదలయలతొ నానా విశ్వము నడిపి పాలించు నటేశ మూర్తి
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
నాదలయలతొ నానా విశ్వము నడిపి పాలించు నటేశ మూర్తి
జగజ్జాలమును సర్వము తానౌ అంతర్యామి మహాష్టమూర్తి
అనేక మూర్తుల ఆదిదేవుడు అనవతరం మమ్మాదుకునే శివుడు
సకల జగద్వయ సం హారకుడు రుద్ర దీప్తి శరభేశ్వర మూర్తి
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
సకల జగద్వయ సం హారకుడు రుద్ర దీప్తి శరభేశ్వర మూర్తి
జ్ఞాన వైరాగ్య నిష్టా తాపసి అక్షయ వరదుడు భిక్షుక మూర్తి
అనేక మూర్తుల ఆదిదేవుడు అనవతరం మమ్మాదుకునే శివుడు
దశ భుజమ్ములను నానాయుధముల దాల్చిన పంచముఖోజ్వల మూర్తి
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
దశ భుజమ్ములను నానాయుధముల దాల్చిన పంచముఖోజ్వల మూర్తి
తంత్రారద్యుదు మంత్ర గమ్యుడు బహు విధ రూపుడు భైరవ మూర్తి
అనేక మూర్తుల ఆదిదేవుడు అనవతరం మమ్మాదుకునే శివుడు శివుడు
అమృతముతో తడిసిన సిరి రూపము శాంతికరము మృత్యుంజయ మూర్తి
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
అమృతముతో తడిసిన సిరి రూపము శాంతికరము మృత్యుంజయ మూర్తి
ఆదిమ గ్రుహస్థు ఆర్యా హ్రుదయుదు కుమార గణేశ సమేత మూర్తి
అనేక మూర్తుల ఆదిదేవుడు అనవతరం మమ్మాదుకునే శివుడు
అనేక మూర్తుల ఆదిదేవుడు అనవతరం మమ్మాదుకునే
శివుడు శివుడు శివుడు
శివస్మరణము 03
ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి, సదాశివుని దరిచేరితి
ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి, సదాశివుని దరిచేరితి
కనిపించెను ధ్యాన్నమ్మున కైలాస లోకము
కైలాస శైలమ్మున కల్పవృక్షము
కనిపించెను ధ్యాన్నమ్మున కైలాస లోకము
కైలాస శైలమ్మున కల్పవృక్షము
కల్పవృక్ష మూలమ్మున కనకపు సింహాసనము
సింహాసనమందు మహాదేవ రూపము
ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి, సదాశివుని దరిచేరితి
గౌరి సతి అంకమందు కార్తికేయుడు, విభుని ఒడిన ఆసీనుడు విఘ్ననాధుడు
గౌరి సతి అంకమందు కార్తికేయుడు, విభుని ఒడిన ఆసీనుడు విఘ్ననాధుడు
పలు విధముల కీర్తించెను పరవశమున సుర ముని గణము
అపురూపము హరుని కొలువు అద్భుతమానందము
ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి, సదాశివుని దరిచేరితి
స్ఫటికపు సిరి ఛాయల మేనువు పచ్చని పులి తోలు వలువ
నెలవంకను జలధారిని నిలిపిన పెను జడల తల
స్ఫటికపు సిరి ఛాయల మేనువు పచ్చని పులి తోలు వలువ
నెలవంకను జలధాణిని నిలిపిన పెను జడల తల
మూడు కనుల మొలక నవ్వు ముచ్చటైన మోము
నాగాలంకారములు నానా లావణ్యములు
ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి, సదాశివుని దరిచేరితి
ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి, సదాశివుని దరిచేరితి
నలుసంత నేనెంత నిఖిలాత్మ నీ చెంత
నలుసంత నేనెంత నిఖిలాత్మ నీ చెంత
నిష్టూరమా నాతో.... విడ్డూరమే కదా ......
నిష్టూరమా నాతో... విడ్డూరమే కదా నరుని తోవంతా నవ్వరా అంతా
పరమాత్మ నాతో పంతం పరువుంచుతుందా
నలుసంత నేనెంత నిఖిలాత్మ నీ చెంత
నలుసంత నేనెంత నిఖిలాత్మ నీ చెంత
నీ దారి నవరోధించ నీ కొడుకునా ఆతడి దుందుడుకునా
నీ వారిని అవమానించ ప్రేత పతినా ఆతడి ఆశ తటినా
నీలో కాంత కాంక్ష కలిగించ కమ్మ వింటి కంతుడినా
నీతో పంతాలాడి కలగించ దమ్ములున్న కవ్వడినా
నీ చూపు కందె చొరవ నీ చూపున కందే విలువ నాకు కలదందువా రాకసుల బంధువా
నలుసంత నేనెంత నిఖిలాత్మ నీ చెంత
నలుసంత నేనెంత నిఖిలాత్మ నీ చెంత
నీ అవధులు అవలోకించ ధాత తరమా ఆతడి తాత తరమా
నీ అంతరార్ధము నెంచ పాణి వశమా పుత్తడి రాణి వశమా
భిక్షా నినుగని ఉపేక్షించ గల దక్షత గలిగిన దక్షుడునా
వృక్ష వాహన నిను అవనికి దించగా దీక్ష భూను దశకంఠుడునా
పరియాచకాలా నాతో సరిసాటి వాడను నేనా అణువుతో అద్రికి తగువా అర్హతలు చూసుకోవా
నలుసంత నేనెంత నిఖిలాత్మ నీ చెంత
నలుసంత నేనెంత నిఖిలాత్మ నీ చెంత
అపచారమేమి చేసిన అవజ్ఞాత కాదు శివయ్యా అజ్ఞానమే నయ్యా
నీ అనుగ్రహమే కాని ఆగ్రహము తాలను శివయ్యా అర్భకుడునయ్యా
పిచ్చుక పైన పినాకపాణి చిచ్చర శరముల విలువిచ్చా
రక్షణ కైనా అర్చన చాలని బాలుని పైనా అలుకంత
సురాసురులు ఇది విన్నారా అకారుణ నవ్వుతారయ్యా ప్రమధులీ పద్ధతి చూస్తే పలచనయి పొతావయ్యా
నలుసంత నేనెంత నిఖిలాత్మ నీ చెంత
నలుసంత నేనెంత నిఖిలాత్మ నీ చెంత
శివస్మరణము 04
శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం
శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం నీరాజనం
సామి సామెని సొగసైన గౌరమ్మ నిఖిల జనని నీకు నీరాజనం నీరాజనం
అంతరాయములను అంతమొందించెటి గణనాయక నీకు నీరాజనం
శక్త్యాయుధముతొ సకలమ్ములను పాలించు దేవ షణ్ముఖ విభొ నీరాజనం దేవ షణ్ముఖ విభొ నీరాజనం...
శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం నీరాజనం
దక్ష మఖ విధ్వంస భద్ర పరదాయక వీరభద్రా నీకు నీరాజనం నీరాజనం
శంభు వాహన మద్దిత శైలాభ దేహ వీర నందీశ్వర నీరాజనం
ఫ్రభు సేవ లో మురియు ప్రమధ వరులార నిత్య శివ మయులార నీరాజనం. నిత్య శివ మయులార నీరాజనం
శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం
శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం నీరాజనం
శివస్మరణము 02
CONTACT US
admin@veerashaivadharmam.com