పారమేశ్వరాగమము
మతభేద స్వరూపనిరూపణము
మంగళాచరణమ్
వందే గిరీంద్రతనయాద్విరదానవాగ్ని
భూనందిభ్రుజ్గిరిటిసేవితపాదపద్మమ్।
పఞ్చాననం ఫణిశశీభతరక్షుచర్మ
భూషం మహేశమనిశం శిరసా గిరీశమ్॥
పార్వతి, గణేశ, కార్తికేయ, నంది, భృంగి, రిటి ఇత్యాది ప్రమథగణములచేత సేవించబడు పాదపద్మములవాడు, అయిదు ముఖములవాడు, సర్పమును, చంద్రుని, ఏనుగు మరియు పులిచర్మములను ఆభరణములగా ధరించినవాడు మహేశ్వరుడయిన గిరీశునకు నిరంతరం శిరసు వంచి నమస్కరింతును.
పాశాఙ్కుశేష్టదవిషాణకరాగ్రబీజ -
పూరోజ్జ్వలం తరుణదివ్య జటాప్రకాశమ్।
కోటీరకోటిశశిరేఖముమాతనూజం
వందే గణేంద్రమనిశం వరదానదక్షమ్॥
పాశ, అంకుశ, వరద (ముద్రను), బీజములతో నిండిన (దానిమ్మ) ఫలమును హస్తములయందు ధరించి, సుందరమైన జటాజూటములతో ప్రకాశించుచు, లలాటాంతమున చంద్రరేఖనలంకరించుకుని భక్తులకు వరముల నిచ్చుటలో దక్షుడైన ఉమాసుతుడైన గణనాథునకు ఎల్లప్పుడు నమస్కరింతును.
కైలాసశిఖరే రమ్యే సిద్ధగంధర్వసేవితే।
సర్వకల్యాణనిలయే పుణ్యే శంకరమందిరే॥
ఏకదా రహసి ప్రేమ్ణా పార్వతీ పరమేశరమ్।
సర్వలోకోపకారాయ నమస్కృత్యైవమబ్రవీత్॥
ఒకప్పుడు సిద్ధ, గంధర్వులచేత సేవించబడుతూ, సమస్తశుభములకు నిలయము, పరమపవిత్రము, శివునకావాసము అయిన కైలాస పర్వతశిఖరము నందు అత్యంతసుందరమైన ఏకాంతప్రదేశమున పార్వతీదేవి ప్రేమతో పరమేశ్వరునకు నమస్కరించి సమస్తలోకోపకార్థమై ఇట్లు పలికినది.
మత భేదనిరూపణము
పార్వతి ప్రశ్న:
దేవదేవ మహాదేవ చంద్రశేఖర ధూర్జటే।
మతభేదస్వరూపం మే వద తత్త్వేన సర్వశ:॥
మతాని కతి భేదాని లక్షణం తస్య తస్య కిమ్।
ఆచారశ్చ కథం తత్ర ప్రాయశ్చిత్తం ఫలం త్వపి ॥
దేవాధిదేవా! మహాదేవా! చంద్రశేఖరా! ధూర్జటీ! (లోకమునందలి) మతభేధములను వాటి యథార్థస్వరూపమును సమగ్రముగా తెలియజేయుము. మతములెన్ని విధములు? వాటి వాటి లక్షణములేవి? వాటిని ఆచరించు విధానమేది? వాతికి సంబంధించిన ప్రాయశ్చిత్తవిధులను, వాటి ఫలములను నాకు తెలియజేయుడు.
ఈశ్వర ఉవాచ:
శృణు దేవి ప్రవక్ష్యామి మతానాం లక్షణాదికమ్।
యద్ జ్ఞాత్వా నిర్వృతిం యాతి శివ: సంజాయతే స్వయమ్॥
ఈశ్వరుని సమాధానము: ఓ దేవి! ఏ జ్ఞానముచేత (మానవుడు) ముక్తుడై, స్వయముగా తానే శివుడగుచున్నాడో, అటువంటి (జ్ఞానమును బోధించు) మత లక్షణాదులను చెప్పెదను వినుము.
మా ఆదేశముననుసరించి పారమేశ్వరాగమమునకు సవివరణలతో ఆంధ్రానువాదమును సిద్దముచేసినవారు సిద్దముచేసినవారు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయమున సంస్కృతాచార్యులు డా॥ కె.ప్రతాప్ గారు. ఆగమ సాహిత్యానికి మరింత సేవచేసే శక్తి సామర్థ్యములు, ఆయురారోగ్యములు వారికి సమకూరాలని ఆశీర్వదిస్తున్నాము.
ఇత్యాశిష:
CONTACT US
admin@veerashaivadharmam.com