పారమేశ్వరాగమము
హోమ విధి నిరూపణము
ఈశ్వర ఉవాచ
ఉపవిశ్య గురుః పీఠే ప్రాణాయామాదికం చరేత్।
వీరశైవాఖ్యదీక్షాంగం కరిష్యే హోమమిత్యథ॥1॥
కృత్వా సంకల్పమీశాని హోమదేశం విశోధయేత్।
స్థండిలం వాపి కుండం వా యథాకామం సమాచరేత్॥2॥
మహేశ్వరీ! గురువు తన పీఠమున కూర్చొని ప్రాణాయామాదికములను నిర్వహించవలెను. తరువాత వీరశైవ మతముననుసరించి దీక్షావిధికి అంగముగా హోమము చేయుచున్నాను అన్న సంకల్పము చేసి హోమము చేయు ప్రదేశమును శుద్ధిచేయవలెను.
హోమవేదిక - కుండ ప్రకారములు
స్తండిలే సర్వసంపత్తిః కుండే సర్వార్థసిద్ధయః।
స్థండిలం త్రివిధం ప్రోక్తం కుండం పంచవిధం శివే॥3॥
శివే! ఆయా కోరికలననుసరించి హోమవేదికలను, కుండలములను నిర్మించుకొనవలెను. వేదికపై జేసిన హోమము సర్వసంపదలను కలుగజేయును. కుండమున హోమము జేసిన సర్వార్థములను సిద్ధింపజేయును. వేదిక మూడు విధములు, కుండము ఐదు విధములు.
చతురస్రత్య్రస్రవృత్తభేదా ధర్మార్థకామదాః।
చతురస్రత్య్రస్రవృత్తార్ధచంద్రకమఠాః క్రమాత్॥4॥
ధర్మార్థకామసాయుజ్యకైవల్యఫలదాయినః।
ఎతేష్వన్యతమే దేవి ప్రదేశే హోమకర్మణః॥5॥
పుణ్యహవాచనం కృత్వా నాందీకర్మ సమాచరేత్।
పంచగవ్యాదికం పీత్వా సభాం చ శివయోగినామ్॥6॥
చతురస్ర, (చతుర్భుజ) త్య్రస్ర (త్రికోణ), వృత్త (గోళ) మనుభేదములు గల వేదిక వరుసగా ధర్మ - అర్థ - కామమనెడి ప్రయోజనములను సిద్ధింపజేయును. అటులనే చతురస్ర, త్య్రస్ర, వృత్త, అర్థచంద్ర, కూర్మాకృతి కుండములు వరుసగా ధర్మ - అర్థ - కామ - సాయుజ్య - కైవల్యములను ఫలములను కలుగజేయును. హే దేవీ! వీటిలో దేనినైనా నొకదానిని (వేదిక లేదా కుండమును) హోమమునకు ఎన్నుకుని హోమ కర్మాంగముగా పుణ్యాహవాచనము చేసి శుభప్రదమైన నాందీకర్మను ఆరంభించవలెను.
వివరణ: పుణ్యాహవాచనం. ఆచనము చేసి, ప్రాణాయామము నాచరించి, దేశ కాలాదులను పేర్కొని, హోమకర్మాంగభూతముగా శుద్ధి, వృద్ధి, అభ్యుదయ సిద్ధి కొరకు పరమేశ్వర ప్రీతికై, వ్రత, నియమ, స్వాధ్యాయ, దమ, దానవిశిష్టులైన మహేశ్వరులతో పాటు స్వస్తి పుణ్యహవాచనము నొనరింతునని సంకల్పించి, వారితో పుణ్యాహవాచనము నిట్లు చెప్పించవలెను-
యజమాని మహేశ్వరులు
ఓం అపః ఓం శివా ఆపస్సంతు
ఓం సుమనసః ఓం సౌమనస్యమస్తు
ఓం అక్షతం ఓం అక్షతారిష్టం చాస్తు
ఓం గంధః పాంతు ఓం సౌమంగల్యమస్తు
ఓం అక్షతాః పాంతు ఓం ఆయుష్యమస్తు
ఓం పుష్పాణి పాంతు ఓం సుశ్రేయో2స్తు
ఓం తాంబూలాని పాంతు ఓం ఐశ్వర్యమస్తు
ఓం దక్షిణాః పాంతు ఓం బహుదేయాంచాస్తు
ఇలా యజమాని మహేశ్వరులకు గంధ, అక్షత, పుష్ప, తాంబూలములను దక్షిణతోపాటు ఇవ్వవలెను. ఆ తరువాత "యం కృత్వా సర్వవేదయజ్ఞ క్రియాకరణ కర్మారంభాః శుభాశ్శోభనాః ప్రవర్తంతే. తమహమోంకారమాదిమం కృత్వా భవద్భిరనుజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే" అని యజమాని చెప్పవలెను. దానికి మహేశ్వరులు 'ఓం వాచ్యతాం ' అన్న అంగీకారమును తెలిపిన తరువాత యజమాని 'భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవాః ' ఇత్యాది మత్రములను పఠించవలెను. ఇది పుణ్యాహవాచనము.
నాందీకర్మ: యజమాని 'ఏవం గుణవిశిష్టాయాం శుభతిథే అద్య కరిష్యమాణస్య... అంగభూత నాందీ శోభనదేవతా ముద్దిశ్య నాందీ శోభనదేవతా ప్రీత్యర్థం నంద్యాది చతుర్వింశతి ప్రథగణసమార్రాధనం కరిష్యే ' అని సంకల్పము చేసి, నంద్యాది ఇరువది నాలుగు ప్రమథగణాధీశులను ఆహ్వానించి షోడశోపచారములతో పూజించి, 'నాందీ చతుర్వింశతి మహేశ్వరారాధన ప్రత్యామ్నాయం యథాశక్తి హిరణ్యదానం కరిష్యే' అని ఇరువది నాలుగు మహేశ్వరులకు 'ఇదం హిరణ్యం నాందీశోభనదేవతా ప్రీతిం కామయమానః మహేశ్వరేభ్యః సంప్రదదే, న మమ, నమమ ' అని పఠించుచూ సమర్పించవలెను. అపుడు మహేశ్వరులు ఆశీర్వదించవలెను. - శ్రీనంది, భృంగి, వీరక, వీరభద్ర, పుష్పదంత, అండాభరణ, దండపాణి, చండేశ్వర, దారుక, రేణుక, వికర్ణ, విజయకర్ణ, ఘంటాకర్ణ, గోకర్ణ, రేవణసిద్ధ, మరుళసిద్ధ, ఏకోరామ, పండితారాధ్య, సుకేతు, రురు, ఉపమన్యు, భృగు, దధీచి, గౌతములు - నంద్యాది ఇరువది నాలుగుమంది ప్రమథగణాధిపతులుగా పేర్కొనబడినారు.
అతి త్వరలో అందజేయబడును...
అతి త్వరలో అందజేయబడును...
అతి త్వరలో అందజేయబడును...
అతి త్వరలో అందజేయబడును...
అతి త్వరలో అందజేయబడును...
అతి త్వరలో అందజేయబడును...
అతి త్వరలో అందజేయబడును...
అతి త్వరలో అందజేయబడును...
అతి త్వరలో అందజేయబడును...
CONTACT US
admin@veerashaivadharmam.com